JEE Main 2021 Exam Dates: జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది
JEE Main 2021 Exam Dates: దేశంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ (జేఈఈ) మెయిన్ 2021 మూడో సెషన్, నాలుగో సెషన్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి.
జేఈఈ మెయిన్ మూడో సెషన్ (ఏప్రిల్ ఎడిషన్) పరీక్షలు జూలై 20 నుంచి 25వ తేదీ వరకు.. నాలుగో సెషన్ (మే ఎడిషన్) పరీక్షలు జూలై 27 నుంచి ఆగస్ట్ 2వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు.
జేఈఈ మెయిన్స్ పరీక్షలు నాలుగు ఎడిషన్లలో జరుగుతాయి. ఫిబ్రవరిలో మొదటి ఎడిషన్, మార్చిలో రెండో ఎడిషన్.. ఏప్రిల్, మే నెలల్లో మూడు, నాలుగో ఎడిషన్లు జరుగుతాయి. మొదటి రెండు సెషన్లు ఇప్పటికే పూర్తయ్యాయి. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి.
జేఈఈ మూడు, నాలుగు ఎడిషన్లకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు మరో ఛాన్స్ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. మూడో సెషన్ పరీక్ష కోసం జూలై 6 నుంచి 8వ తేదీ వరకు.. నాలుగో సెషన్ కోసం జూలై 9 నుంచి 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
అభ్యర్థులకు పరీక్ష కేంద్రాన్ని మార్చుకునే సౌకర్యాన్ని కల్పించారు. ఈ రెండు సెషన్ల ఫలితాలను ఆగస్టులో విడుదల చేసే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు, దరఖాస్తుల కోసం https://nta.ac.in/ లేదా https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్లను చూడవచ్చు.
కోవిడ్ నిబంధనలను పాటించి ఈ పరీక్షలను నిర్వహించనుంది. టైమ్ స్లాట్ విధానంలో పరీక్షలు నిర్వహించనుంది. అభ్యర్థులకు మాస్కులను ఇవ్వడంతో పాటు సోషల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలను తీసుకోనుంది.