CIPIT: 'ప్లాస్టిక్' డిప్లమో కోర్సులకు పెరుగుతోన్న డిమాండ్..
Central Institute of Petrochemicals Engineering & Technology (CIPET) : టెన్త్ తర్వాత డిఫరెంట్ కెరీర్ ఎంచుకోవాలనుకుంటున్నారా? ప్లాస్టిక్ ఉత్పత్తులకు సంబంధించి ఓ డిప్లమా కోర్సు ఉందని మీకు తెలుసా? సీఐపీఈటీ అనే సంస్థ ఈ కోర్సును అందిస్తోంది. దేశం మొత్తంలో దీని క్యాంపస్‌లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడల్లో ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఈ కోర్సుల్లో చేరవచ్చు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ (సీఐపీఈటీ) ప్లాస్టిక్ డిప్లమో టెక్నాలజీ కోర్సులను అందిస్తోంది. ఇదో ప్రభుత్వ రంగ సంస్థ. దీన్నే సీపెట్ అని కూడా పిలుస్తారు. ప్లాస్టిక్ డిప్లమో కోర్సుల్లో చేరేందుకు ఈ సంస్థ ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తుంది.
ఈ ఏడాది డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ ఎంపీసీ / బైపీసీ లేదా నిర్దేశించిన బ్రాంచీల్లో రెండేళ్ల ఐటీఐ పాస్ అయిన వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్పుడే పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు రెండో వారంలో తరగతులు ప్రారంభం అవుతాయి.
డిప్లొమా అర్హతతో ప్లాస్టిక్ అనుబంధ పరిశ్రమలు, ప్లాస్టిక్ వినియోగ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయి. డిప్లమో తర్వాత కూడా చదువు కొనసాగించాలంటే ఇదే రంగంలో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు చేయవచ్చు. దీనికి సంబంధించి కూడా సీపెట్ ఏటా నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.
కరోనా నేపథ్యంలో పీపీఈ కిట్లు, గ్లౌజులు, హ్యాండ్ శానిటైజర్లు, మాస్కులు వంటి వాటికి డిమాండ్ బాగా పెరిగింది. దేశంలో స్వదేశీ వస్తువుల వాడకం కూడా పెరగడంతో ప్లాస్టిక్ ఆధారిత పరిశ్రమల్లో ఉద్యోగాలు పెరిగాయి. ఈ పరిశ్రమల్లో ప్లాస్టిక్ ఇంజనీరింగ్ నిపుణుల అవసరం ఏర్పడింది. దీంతో ప్లాస్టిక్ కోర్సుల్లో చదివిన వారికి డిమాండ్ పెరిగింది.
సీపెట్‌లోని కోర్సులకు ఏఐసీటీఈ గుర్తింపు కూడా ఉండటంతో దేశంలోని అన్ని ప్రముఖ కంపెనీలు ఇక్కడి విద్యార్థులకు మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు ఇస్తున్నాయి.