PF Balance Check: పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ చేసిన కేంద్రం, బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి
పీఎఫ్ అకౌంట్ ద్వారా భారతదేశంలో ఉద్యోగులు ఒక రకంగా పొదుపు ఖాతాగా ఉపయోగిస్తారు. ఇందులో జమ అయ్యే మొత్తానికి మీకు ప్రభుత్వం వడ్డీ ఇస్తుంది. మీకు అవసరమైన కొన్ని సందర్భాలలో ఈ ఖాతా నుండి డబ్బులు విత్ డ్రా తీసుకోవచ్చు.
ఖాతాదారులకు PF ఖాతాలో కేంద్రం ఇటీవల వడ్డీ డబ్బు జమ చేసింది. EPFO వెబ్‌సైట్‌ను సందర్శించి ఖాతాదారులు PF బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు. కొన్నిసార్లు సైట్ డౌన్ అయితే వారు బ్యాలెన్స్ చెక్ చేయలేరు.
మీ ప్రావిడెంట్ PF Balance చెక్ చేయడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. మీరు మీ ఫోన్ నుండి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా PF బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. మీ మొబైల్ నంబర్ మీ PF ఖాతా, మీ ఆధార్ కార్డుతో లింక్ చేసి ఉండాలి.
మిస్డ్ కాల్ ద్వారా మీరు PF బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకుంటే, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425 కు ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఈ కాల్ ఆటోమేటిక్ గా కట్ అయి.. కాసేపటి తర్వాత, మీ మొబైల్ కు PF బ్యాలెన్స్ సమాచారం మెసేజ్ వస్తుంది.
మీరు మెస్సేజ్ చేయడం ద్వారా మీ PF ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. పీఎఫ్ ఖాతాదారులు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899 నంబర్ కు EPFOHO UAN <మీ భాష మొదటి మూడు అక్షరాలు>' టైప్ చేయాలి.
మీకు తెలుగులో సమాచారం కావాలనుకుంటే 'EPFOHO UAN TEL' అని సందేశం పంపాలి. ఇంగ్లీషులో కావాలంటే 'EPFOHO UAN ENG' అని టైప్ చేయాలి. కొంత సమయానికి మీకు SMS ద్వారా మీ PF అకౌంట్ బ్యాలెన్స్ అందుతుంది.