Xiaomi SU7: షావోమీ ఎలక్ట్రిక్ కారు ఇదే - అదిరిపోయే డిజైన్‌తో!
చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ కార్ల బిజినెస్‌లోకి కూడా ప్రవేశించింది. తన మొట్టమొదటి కారును డిస్‌ప్లే చేసింది. దీనికి షావోమీ ఎస్‌యూ7 అని పేరు పెట్టింది. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ కారు. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024లో దీన్ని డిస్‌ప్లే చేశారు.
2023లో షావోమీ ఎస్‌యూ7ను చైనాలో మొదట ప్రదర్శించారు. లుక్స్ పరంగా ఈ కారు చాలా ఇంప్రెసివ్‌గా ఉంది.
0 నుంచి 60 మైళ్ల వేగాన్ని ఈ కారు కేవలం 2.78 సెకన్లలోనే అందుకోనుంది. అంటే దాదాపు 100 కిలోమీటర్ల వేగం.
ఈ కారును ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఈ కారులో 497 మైళ్లు ప్రయాణించవచ్చని కంపెనీ అంటోంది. అంటే దాదాపు 800 కిలోమీటర్ల దూరం అన్నమాట.
ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 15 నిమిషాలు ఛార్జింగ్ పెడితే 520 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ ప్రకటించింది. దీని ధర ఎంత ఉండవచ్చో కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
త్వరలో భారత్ సహా అనేక గ్లోబల్ మార్కెట్లలో ఈ కారు లాంచ్ కానుంది. అప్పుడే దీని ధరను కూడా ప్రకటించే అవకాశం ఉంది. రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల మధ్యలో దీని ధర ఉండే అవకాశం ఉంది.