ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసిన షావోమీ - ప్రపంచంలోనే టాప్-5 టార్గెట్‌గా!
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన మొదటి ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసింది. ప్రపంచంలోని టాప్ ఫైవ్ ఆటోమేకర్ల జాబితాలో చేరాలనే కోరికను కూడా ఈ సందర్భంగా వ్యక్తం చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appషావోమీ ఎస్‌యూ7 అనే కారును మొదట పరిచయం చేసింది. షావోమీ ఎస్‌యూ7 సెడాన్ సంస్థ తీసుకువస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మోడల్.
అత్యంత ప్రజాదరణ పొందిన షావోమీ స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఈ కారులో అందించవచ్చని భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లలో ధరల విషయంలో షావోమీ చాలా అగ్రెసివ్‌గా వ్యవహరిస్తుంది. మరి కార్ల విషయంలో ఎలా ఉంటుందో చూడాలి.
కార్ల విషయంలో కూడా షావోమీ పెద్ద టార్గెట్స్‌ను పెట్టుకుంది. భవిష్యత్తులో పోర్షే, టెస్లా వంటి కార్లతో పోటీ పడేలా మంచి కార్లను రూపొందించాలని అనుకుంటోంది. దీని కోసం రాబోయే 15 నుంచి 20 సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో శ్రమించాల్సి ఉంటుంది. టాప్ ఫైవ్ ఆటోమేకర్స్‌లో షావోమీ చేరడం వల్ల చైనా ఆటోమొబైల్ రంగానికి ఎంతో బలం చేకూరనుంది.
అనేక కంపెనీల మాదిరిగానే షావోమీ కూడా ఈవీ సెక్టార్‌లో కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తోంది. కంపెనీ ఈ కారు గురించి 2021లోనే మొదటిగా మాట్లాడింది.
వచ్చే దశాబ్దంలో ఆటో పరిశ్రమలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడం గురించి కూడా కంపెనీ డిస్కస్ చేసింది.