ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రత్యేక షోరూం - లాంచ్ చేసిన టాటా!
టాటా మోటార్స్ తన మొదటి ఎలక్ట్రిక్ కార్ల షోరూంను గురుగ్రామ్‌లో లాంచ్ చేసింది. ఇందులో రెండు స్టోర్లు ఉన్నాయి. మరిన్ని నగరాల్లో కొత్త స్టోర్లు త్వరలో ప్రారంభం కానున్నాయి.
టాటా తన ఎలక్ట్రిక్ వాహనాల విభాగాన్ని ఇటీవలే సపరేట్ చేసింది. దానికి టాటా.ఈవీ అని పేరు పెట్టారు. ఇకపై టాటా ఎలక్ట్రిక్ వాహనాలన్నీ ఈ బ్రాండింగ్ మీదనే రానున్నాయి.
టాటా.ఈవీ స్టోర్లు డిజైన్ పరంగా చాలా కొత్తగా ఉన్నాయి. మిగతా టాటా షోరూంల కంటే ప్రీమియం లుక్‌లో వీటిని చూడవచ్చు.
వీటిలో ఈవీ కార్లను విక్రయించడంతో పాటు సర్వీస్ సెంటర్లుగా కూడా వ్యవహరించనున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో డామినేట్ చేయాలనే లక్ష్యాన్ని టాటా బలంగా నిర్ణయించుకుంది.
ప్రస్తుతానికి భారతీయ ఎలక్ట్రిక్ ఈవీ మార్కెట్లో టాటా నంబర్ వన్‌గా నిలిచింది. ఇందులో టాటా నెక్సాన్‌దే కీలక పాత్ర.
ఈ స్టోర్ల లుక్ కూడా చూడటానికి ఎకో ఫ్రెండ్లీగా ఉన్నాయి. మనదేశంలో కేవలం ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఏర్పాటు చేసిన మొదటి షోరూం ఇదే.