In Pics: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి గెరిల్లా 450 కొత్త బైక్ - ఫోటోలు
రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి గెరిల్లా 450 (Guerrilla 450) పేరుతో ఓ కొత్త బైక్ విడుదల కాబోతోంది. దీని ఫస్ట్ లుక్ ఫోటోలు తాజాగా విడుదల అయ్యాయి. దీన్ని హిమాలయన్ 450 అని కూడా పిలవచ్చు. ఎందుకంటే ఇది ప్రీమియం రోడ్‌స్టర్ విభాగంలోని హిమాలయన్ మోడల్ లోని చాలా భాగాలను పోలి ఉంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబేసిక్ ఫీచర్స్ లో భాగంగా '452cc షెర్పా ఇంజన్' 8,000 rpm వద్ద 40 PS.. 5,500 rpm వద్ద 40 NM గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. హిమాలయన్ మాదిరిగానే అయినప్పటికీ, ఇంజిన్ దాని ఆకారానికి సరిగ్గా సరిపోయేలా ఉంది.
గేర్ వ్యవస్థతో పాటు ఇందులో మార్పులు చేసినట్లుగా కంపెనీ తెలిపింది. అసిస్ట్, స్లిప్ క్లచ్‌తో కూడిన 6 - స్పీడ్ గేర్‌బాక్స్, 17-అంగుళాల ఫ్రంట్, రేర్ ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి. 1440 mm వీల్ బేస్, 43mm టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుకవైపు లింకేజ్-టైప్ మోనో-షాక్, పెర్ఫార్మెన్స్ మోడ్/ఎకో మోడ్ ఉన్నాయి.
మరిన్ని ఫీచర్లు ఇలా ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450లో స్టెప్డ్ బెంచ్-సీట్, 11 లీటర్ల ఇంధన ట్యాంక్, LED హెడ్ లైట్లు, ఇంటిగ్రేటెడ్ టెయిల్ ల్యాంప్‌తో కూడిన ట్రాఫిక్ లైట్స్ ఉన్నాయి. అప్‌స్వెప్ట్ సైలెన్సర్ ఇందులో ఉన్నాయి.
టాప్, మిడ్ వేరియంట్‌లలో రూట్-రికార్డింగ్ వంటి ఫీచర్‌లు ఉంటాయి. RE యాప్‌తో దీన్ని యాక్సెస్ చేయొచ్చు. మొత్తం ఆరు వేరియంట్ లు ఉండగా.. వాటిలో అనలాగ్, డాష్, ఫ్లాష్‌లు ఉంటాయి. అనలాగ్‌లో స్మోక్ సిల్వర్, ప్లేయా బ్లాక్ ఉంటాయి. ఈ వేరియంట్‌లో TFT క్లస్టర్ లేదు.
కానీ, ప్లేయా బ్లాక్‌లో TFT డిస్‌ప్లే ఉంటుంది. ఫ్లాష్ వేరియంట్ లెవెల్‌లో, ఎల్లో రిబ్బన్, బ్రావా బ్లూ టాప్ స్పెక్స్‌తో వస్తాయి. అనలాగ్ వేరియంట్ కనీస ధర రూ.2.39 లక్షలతో మొదలవుతుంది.
మరో వేరియంట్ డాష్ రూ.2.49 లక్షలతో పాటు ఫ్లాష్ బైక్ రూ.2.54 లక్షలుగా చెబుతున్నారు.
అందువల్ల, ఈ రాయల్ ఎన్ ఫీల్డ్ గెరిల్లా బైక్ ఆ రేంజ్ లోని ఇతర బైక్ ల కంటే ధర ఎక్కువగానే ఉంది.
ఇక ఈ బైక్ రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ కంటే తేలికగా ఉంటుంది.
అయితే ట్రయంఫ్ స్పీడ్ 400 వంటి ప్రత్యర్థి బైక్ కంటే ఇది బరువుగా ఉంటుంది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. గెరిల్లా ట్యాంక్ పరిమాణం హిమాలయన్ కంటే చిన్నగా ఉంది. అయితే సిటీ రైడింగ్‌కు ఇది అనుకూలంగా భావిస్తున్నారు.