Maruti XL6 Price in Hyderabad: మారుతి XL6 ఫేస్‌లిఫ్ట్ ఆన్-రోడ్ ధర హైదరాబాద్‌లో ఎంత ఉందంటే?

మారుతి XL6 ఫేస్‌లిఫ్ట్ ఆన్-రోడ్ ధర హైదరాబాద్‌లో ఎంత ఉందంటే?
హైదరాబాద్‌లో మారుతి XL6 ఫేస్‌లిఫ్ట్ ఆన్-రోడ్ ధర రూ.14.24 లక్షల నుంచి రూ. 18.26 లక్షల వరకు ఉంటుంది.
ఎంట్రీ మోడల్ XL6 Zeta MT ఆన్-రోడ్ ధర సుమారు రూ.14.24 లక్షల నుంచి రూ.14.63 లక్షల మధ్య ఉంది.
టాప్ వేరియంట్'XL6 Alpha Plus AT Dual Tone' హైదరాబాద్ ఆన్-రోడ్ ధర సుమారు రూ. 18.26 లక్షల వరకు పలుకుతోంది.
ఇందులో 1.5 లీటర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 103 PS పవర్, 137 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.
లాంగ్ డ్రైవ్స్, సిటీ ట్రాఫిక్ కోసం ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్, పెడల్ షిఫ్టర్లతో కూడిన 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.
పెట్రోల్ మ్యాన్యువల్ వేరియంట్ లీటరుకు 20.97 కి.మీ, ఆటోమేటిక్ వేరియంట్ 20.27 కిమీ మైలేజ్ ఇస్తాయి.
Zeta CNG వేరియంట్ కేజీ సీఎన్‌జీకి 26.32 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీని ఆన్-రోడ్ ధర రూ. 15.60 లక్షల నుంచి రూ. 15.82 లక్షల వరకు ఉంటుంది.
ఇందులో 4 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఇచ్చారు.
ఈజీగా పార్క్ చేయడానికి, డ్రైవ్ చేయడానికి వీలుగా 360-డిగ్రీ వ్యూ కెమెరా ఫీచర్‌ను అల్ఫా, అల్ఫా ప్లస్ వేరియంట్లలో అందించారు.