హైదరాబాద్‌లో మారుతి సుజుకి బలెనో ఆన్-రోడ్ ధర ఎంత?

హైదరాబాద్‌లో మారుతి సుజుకి బలెనో ఆన్-రోడ్ ధర ఎంత?
హైదరాబాద్‌లో మారుతి బలెనో బేస్ వేరియంట్ Sigma MT ఆన్-రోడ్ ధర సుమారు రూ.7.18 లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకు ఉంది.
అన్ని టాప్ ఫీచర్లు ఉన్న టాప్-ఎండ్ వేరియంట్ Alpha AMT ఆన్-రోడ్ ధర హైదరాబాద్‌లో సుమారు రూ. 11.02 లక్షల నుంచి రూ. 11.34 లక్షల వరకు పలుకుతోంది.
ఈ కార్‌లో 1197 cc సామర్థ్యం గల K12 Dual Jet పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 88 bhp పవర్, 113 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.
బలెనో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 22.35 కిమీ, ఆటోమేటిక్ (AMT) వేరియంట్ 22.94 కిమీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
సిటీ ట్రాఫిక్‌లో సులభంగా డ్రైవ్ చేయడానికి డెల్టా, జీటా, ఆల్ఫా వేరియంట్లలో 5-స్పీడ్ AMT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ఆన్-రోడ్ ధర రూ. 8.84 లక్షలు.
మైలేజ్ ఎక్కువ కోరుకునే వారి కోసం డెల్టా, జీటా వేరియంట్లలో CNG ఉంది. హైదరాబాద్‌లో బలెనో సీఎన్‌జీ ఆన్-రోడ్ ధర రూ. 9.34 లక్షల నుంచి రూ. 10.43 లక్షల మధ్య ఉంది. ఇది కేజీకి 30.61 కిమీ మైలేజ్ ఇస్తుంది.
డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్డు పైనుంచి దృష్టి మళ్లకుండా వేగం, క్లైమేట్ కంట్రోల్ వంటి వివరాలను విండ్‌షీల్డ్‌పైనే చూపే ప్రీమియం Head-Up Display ఫీచర్ ఇందులో ఉంది.
ఇరుకైన హైదరాబాద్ గల్లీల్లో, పార్కింగ్ స్థలాలలో కారును సులభంగా పార్క్ చేయడానికి 360 డిగ్రీల వ్యూ కెమెరా సిస్టమ్ సహాయపడుతుంది
కొత్త బలెనోలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌పీ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్, ఏబీఎస్ (ABS) విత్ ఈబీడీ (EBD) వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఈ కార్ Suzuki Connect యాప్‌తో వస్తుంది. దీని ద్వారా స్మార్ట్‌వాచ్ లేదా అలెక్సా సహాయంతో కార్ లైట్లు, డోర్ లాక్స్స, బ్యాటరీ హెల్త్‌ను రిమోట్‌గా కంట్రోల్ చేయవచ్చు.
డ్యూయల్-టోన్ ఇంటీరియర్, రేర్ ఏసీ వెంట్స్, టైప్-A, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టులు, 9-ఇంచుల వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్‌ప్లే స్క్రీన్‌తో క్యాబిన్ ఎంతో లగ్జరీగా ఉంటుంది.
హైదరాబాద్‌లో వేరియంట్‌ను బట్టి రోడ్ టాక్స్ (RTO), రిజిస్ట్రేషన్ ఖర్చులు దాదాపు రూ. 83,000 నుంచి రూ.1.69 లక్షల వరకు, అలాగే ఇన్సూరెన్స్ ఖర్చులు రూ. 32,000 నుంచి రూ. 46,000 వరకు అదనంగా అవుతాయి.