Kia EV6: వావ్ అనిపించే లుక్‌తో వస్తున్న కియా ఈవీ6 - ఒక్కసారి చార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు వస్తుందంటే?
కియా మనదేశంలో తన లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారును పరీక్షిస్తుంది. కియా లాంచ్ చేయనున్న మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు ఇదే.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ ఎలక్ట్రిక్ కారును చాలా షార్ప్‌గా డిజైన్ చఏశారు. ఇందులో టైగర్ నోస్ గ్రిల్‌ను అందించారు. ఫ్యూచరిస్టిక్ స్టైల్‌తో ఈ ఈవీ లాంచ్ కానుంది. స్పోర్ట్స్ కార్, ఎస్‌యూవీలను కలిపినట్లు దీని డిజైన్ ఉండనుంది.
కియా ఈవీ6 వీల్ బేస్ 2,900 మిల్లీమీటర్లుగా ఉండనుంది. దీని ఇంటీరియర్ కూడా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉండనుంది. ఏసీకి టచ్ కంట్రోల్ స్విచ్‌లు, హీటెడ్/వెంటిలేటెడ్ సీట్లు/ఏడీఏఎస్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో కియా అందించనుంది. రెండు 12.3 ఇంచుల హెచ్‌డీ టచ్ స్క్రీన్లు ఇందులో ఉండనున్నాయి.
కియా ఈవీ6లో టాప్ ఎండ్ వేరియంట్లను మాత్రమే మనదేశంలో విక్రయించనున్నారు. గ్లోబల్ మార్కెట్లలో మాత్రం చవకైన వేరియంట్లు కూడా ఉన్నాయి.
ఇందులో లాంగ్ రేంజ్, స్టాండర్డ్ రేంజ్ బ్యాటరీ ప్యాక్‌లు అందుబాటులో ఉండనున్నాయి. లాంగ్ రేంజ్ మోడల్ ఒక్కసారి చార్జ్ చేస్తే 528 కిలోమీటర్ల రేంజ్ అందించనుంది. ఈ కారు ధర మనదేశంలో రూ.50 లక్షల పైనే ఉండే అవకాశం ఉంది.