✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Hyundai Alcazar Facelift Photos: హ్యుందాయ్‌ అల్కాజర్‌ ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేసింది- పెట్రోల్, డీజిల్ వెరియంట్స్ ధరలు, ఫీచర్లు ఇవే

Shankar Dukanam   |  10 Sep 2024 04:17 PM (IST)
1

హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా సరికొత్త SUVని తీసుకొచ్చింది. ఎస్‌యూవీ అల్కజార్‌లో నూతన వెర్షన్‌ను సోమవారం నాడు మార్కెట్లోకి విడుదల చేసింది. 6, 7 సీట్ల కాన్ఫిగరేషన్‌లలో అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ సౌకర్యంగా ఉంటుంది.

2

ఈ కొత్త హ్యుందాయ్ అల్కజార్ డీజిల్ వేరియంట్ ధర రూ.15.99 లక్షలు కాగా, పెట్రోల్ వేరియంట్ ధర రూ.14.99 లక్షలు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది.

3

క్రెటా, పాత అల్కజర్‌లా కాకుండా అల్కజార్ ఫేస్‌లిఫ్ట్‌లో చాలా వ్యత్యాసం ఉంది. కొత్త SUVలో భిన్నమైన గ్రిల్, DRL డిజైన్, బంపర్ ఉన్నాయి. హ్యుందాయ్ లోగో సైతం భిన్నంగా ఏర్పాటు చేశారు. ఫ్రంట్ బంపర్‌ పెద్దగా ఉండటంతో పాటు గ్రిల్ రెండు భాగాలుగా చేసినట్లు కనిపిస్తుంది.

4

18 అంగుళాల వీల్స్ తో వెనుక స్టైలిష్‌గా కనిపిస్తుంది. ముందు పెద్ద బంపర్, టెయిల్ ల్యాంప్‌ ఇచ్చారు. గత మోడల్స్ క్రెటా, అల్కజార్ లతో పోల్చితే అల్కజార్ ఫేస్‌లిఫ్ట్ SUV పెద్దగా, పొడవుగా ప్రీమియం లుక్‌లో కనిపిస్తుంది. కస్టమర్ల సౌలభ్యం కోసం చాలా రంగుల్లో అందుబాటులోకి తెచ్చినట్లు హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా సీఓఓ తరుణ్‌ గార్గ్‌ వెల్లడించారు.

5

అల్కజార్ ఫేస్‌లిఫ్ట్ 3 డ్రైవింగ్ మోడ్స్‌ (Normal, Eco, and Sport)తో తెచ్చారు. మట్టిలో, ఇసుకలో, స్నో రోడ్లపై నడిపేందుకు అణువుగా ఉండేలా డ్రైవిండ్ మోడ్స్ (Snow, Mud, and Sand ) సెట్ చేసుకోవచ్చు. 7 సీట్లతో, ప్రీమియం మధ్య స్థాయి స్పోర్ట్స్‌ వినియోగ వాహన (SUV) విభాగంలోకి ఇది వస్తుందన్నారు.

6

డిజైన్స్‌ & డైమెన్షన్స్‌ విషయానికొస్తే.. అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్‌ డిఫరెంట్‌ గ్రిల్, 18-అంగుళాల డైమండ్ కట్ వీల్స్ LED టెయిల్ ల్యాంప్‌, హెడ్‌ల్యాంప్స్‌, H ఆకారపు LED DRLలతో అట్రాక్టివ్ డిజైన్‌తో విడుదల అయ్యింది. ఈ కారు 1,710 mm ఎత్తు, పొడవు 4,560 mm, వెడల్పు 1,800 mm కలిగి ఉంంది. అంతే కాకుండా వీల్‌బేస్‌ 2,760 mm తో వచ్చింది.

7

పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్‌ లో అల్కాజార్ SUV రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తెచ్చారు. ఒకటి 1.5-లీటర్ GDi టర్బో పెట్రోల్ ఇంజిన్ కాగా, గరిష్టంగా 158 bhp పవర్‌ని 253 nm గరిష్ట టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. 1.5 లీటర్ల డీజిల్ ఇంజన్ అత్యధికంగా 113 bhp పవర్‌తో 250 nm మ్యాగ్జిమం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్స్‌ 6-స్పీడ్ ఆటోమేటిక్, 6 స్పీడ్ మాన్యువల్, లేదా 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ తో రిలీజ్ చేశారు.

8

అల్కజార్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ క్యాబిన్ డిజైన్ క్రెటా, అల్కజార్ కంటే సరికొత్తగా అందుబాటులోకి వచ్చింది. హ్యుందాయ్ కొత్త SUVలో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్ (Panoramic Sunroof), 360 డిగ్రీ కెమెరా, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్‌బ్యాగ్స్‌, లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ఫీచర్లు ఉన్నాయి.

9

హ్యుందాయ్ అల్కాజార్ మూడేళ్ల పాటు అన్ లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ ప్యాకేజీతో వచ్చింది. ఇందులో రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కూడా ఉంది. కస్టమర్లు అధిక ధరలో ఐదేళ్ల వరకు ట్రస్ట్ రన్నింగ్ రిపేర్ ప్యాకేజీ లేక 7 ఏళ్ల వరకు వారంటీ ఆప్షన్‌లతో పాటు సూపర్ పీరియాడిక్ మెయింటెనెన్స్ (Super Periodic Maintenance) ప్యాకేజీ వంటి అడషనల్ ప్యాకేజీలు లభిస్తాయి.

10

అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ విడుదలతో మార్కెట్లో ఉన్న టాటా సఫారి, MG హెక్టర్, సిట్రోయిన్ C3 ఎయిర్‌క్రాస్, మహీంద్రా XUV700, కియా కేరెన్స్ లాంటి ఇతర SUVలకు గట్టి పోటీని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆటో
  • Hyundai Alcazar Facelift Photos: హ్యుందాయ్‌ అల్కాజర్‌ ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేసింది- పెట్రోల్, డీజిల్ వెరియంట్స్ ధరలు, ఫీచర్లు ఇవే
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.