Kia EV6 Photos: అందరికీ అందని కియా కారు - స్టైలిష్ లుక్, సూపర్ ఫీచర్లు - ఈవీ6 ఎలా ఉందో చూశారా?
కియా తన లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు కియా ఈవీ6ను మనదేశంలో లాంచ్ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ కారు ధర రూ.59.95 లక్షల (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభం కానుంది. ఎంట్రీ లెవల్ జీటీ లైన్ ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్ ధర ఇది. టాప్ ఎండ్ జీటీ లైన్ ఏడబ్ల్యూడీ వేరియంట్ ధర రూ.65.95 లక్షలుగా (ఎక్స్-షోరూం) నిర్ణయించారు.
కియా మనదేశంలో మొదట కేవలం 100 యూనిట్లను మాత్రమే విక్రయించాలని నిర్ణయించింది.
దీనికి సంబంధించి మొత్తంగా 350 బుకింగ్స్ వచ్చాయని కంపెనీ తెలిపింది. మిగిలిన వారికి బుకింగ్ అమౌంట్ రీఫండ్ ఇస్తారా లేకపోతే ఇంపోర్ట్ నంబర్ పెంచి వారికి కూడా డెలివరీ చేస్తారా అన్నది తెలియరాలేదు
ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 528 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.
350 కేడబ్ల్యూహెచ్ చార్జర్‌ను ఉపయోగిస్తే 10 నుంచి 80 శాతం చార్జింగ్ కేవలం 18 నిమిషాల్లోనే ఎక్కుతుంది.
దీనికి మూడు సంవత్సరాల వారంటీ అందించనున్నారు. ఇక బ్యాటరీకి ఎనిమిది సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్లు తిరిగేవరకు వారంటీ అందించనున్నారు. వీటిలో ఏది ముందు దాటితే అప్పుడు వారంటీ పీరియడ్ ముగిసిపోనుంది.