Best Family Cars Under 10 Lakhs: 10 లక్షల ధరలో లభించే బెస్ట్ కార్లు; MG Comet EV, Tata Tiago CNG & Maruti Baleno.. మీకోసం బడ్జెట్ కార్ల వివరాలు!
పెట్రోల్ కారు విభాగంలో మారుతి సుజుకి బాలెనో అత్యంత నమ్మదగిన ఆప్షన్. ఈ కారు ముఖ్యంగా నగరంలో తక్కువ దూరం నిత్యం తిరిగే ప్రయాణికులకు చాలా మంచిది. నిర్వహణ ఖర్చు కూడా తక్కువే. ఇందులో 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ ఉంది, ఇది లీటరుకు దాదాపు 22 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.
ఈ కారు లోపల చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, ఇందులో పెద్ద కేబిన్, బూట్ స్పేస్ ఉన్నాయి. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెనుక AC వెంట్స్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు ABS వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.
బలెనో ధర 6.75 లక్షల రూపాయల (ఎక్స్-షోరూమ్) నుంచి స్టార్ట్ అవుతుంది. మైలేజీ ఎక్కువ కాలం డ్రైవ్ చేసుకునే వారికి ఈ కారు సరిగ్గా సరిపోతుంది.
ఎలక్ట్రిక్ వెహికల్స్ డ్రైవ్ చేసేందుకు ఇష్టం లేని వారు, ఇంధన పొదుపు గురించి ఆలోచించే వారికి టాటా టియాగో చాలా మంచి ఎంపిక అవుతుంది. ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్+CNG ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది కిలోగ్రాముకు 28 నుంచి 30 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.
టియాగో CNG ని ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో రూపొందించారు, దీనివల్ల బూట్ స్పేస్‌లో పెద్దగా మార్పు ఉండదు. ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ABS, రియర్ పార్కింగ్ సెన్సార్స్ వంటి ఆధునిక భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.
టియాగో CNG ప్రారంభ ధర 6.60 లక్షలు (ఎక్స్-షోరూమ్). తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్ కోరుకునే కుటుంబాలకు ఈ కారు మంచి ఎంపిక అవుతుంది.
ఎంజీ కామెట్ ఈవీ సూపర్ ఎలక్ట్రిక్ కారు. ఇది ముఖ్యంగా సిటీలో తిరిగే వాళ్ల కోసం డిజైన్ చేసింది. కాంపాక్ట్ కారు అయినప్పటికీ నలుగురికి సరిపడా స్థలం ఉంటుంది. ఇందులో ఒక బ్యాటరీ ఉంది. ఒకసారి వంద శాతం ఛార్జ్ చేస్తే దాదాపు 230 కిలోమీటర్లు ట్రావెల్ చేయవచ్చు. ఇంట్లోనే ఛార్జింగ్ చేసుకోవచ్చు.
ఎంజీ కామెట్ ఈవీ కారులో పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ స్పీడోమీటర్ వంటి హై-టెక్ ఫీచర్లు ఉన్నాయి. ఇవే ఈ కారును స్మార్ట్ కార్ల విభాగంలోకి తీసుకువస్తాయి. MG కామెట్ EV ధర 6.99 లక్షల రూపాయల (సబ్సిడీ తర్వాత, ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.