చలికాలం అని స్నానం చేయడం మానేస్తున్నారా? అయితే మీకు ఆ గ్రహ దోషం తప్పదు!
చలికాలం రాగానే చాలా మంది స్నానం చేయడానికి వెనుకంజ వేస్తారు. కొందరు రెండు రోజులకు, మరికొందరు 4 రోజులకు, ఇంకొందరు వారానికి ఒకసారి స్నానం చేస్తారు. ఈ అలవాటు సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఒక చిన్న అలవాటు మీ జాతకంలోని ప్రధాన గ్రహాన్ని ప్రభావితం చేస్తుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రతిరోజు స్నానం చేయడం వల్ల లేదా గంగాజలం, సైంధవ లవణం నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల మీ లగ్న అధిపతి కుండలిలోని మొదటి భావం బలపడుతుంది. ఇది సానుకూల శక్తి కోసం చాలా అవసరం.
హిందూ ధర్మంలో ప్రతిరోజు స్నానం చేయాలని చెబుతారు. స్నానం చేయడం వల్ల శుక్రుడు చంద్రుడు బలపడతారు, దీనివల్ల మనస్సు మెదడు రెండూ తాజాగా ఉంటాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్నానం మానేయడం వల్ల మీ శని బలహీనపడుతుంది. మురికి రాహువు యొక్క ప్రతికూల శక్తిని సక్రియం చేస్తుంది, దీనివల్ల జీవితంలో భ్రమలు అడ్డంకులు ఎదురవుతాయి. అందుకే మిమ్మల్ని మీరు శుభ్రపరుచుకోవడం ముఖ్యం.
చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేయడానికి బదులుగా గోరువెచ్చని నీటితో స్నానం చేయడానికి ప్రయత్నించండి. బట్టలను శుభ్రంగా ఉంచుకున్నట్లే శరీరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల మీ శరీర కాంతి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది.