శని ప్రభావం ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు తగ్గుతుంది
సాధారణంగా దురదృష్టం అనే పదం వినగానే ప్రజలు దానిని ప్రతికూలంగానే చూస్తారు. జ్యోతిషశాస్త్రంలో పనోతి ( దురదృష్టం) అనే పదం శనికి సంబంధినది
పెద్ద శని దశ అంటే ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది.. అంటే ఇది ఏల్నాటి శని అన్నమాట. చిన్న శని దశ అంటే రెండున్నరేళ్లు ఉంటుంది.. ఇది అష్టమ, అర్ధాష్టమ శని
సాధారణంగా పనోతి అంటే చెడు, అశుభం, దురదృష్టం లేదా పనిని పాడుచేసేది అని అర్థం. అలాంటి సందర్భంలో శని పనోతి ప్రజలకు వరమా లేక శాపమా, తెలుసుకుందాం.
జ్యోతిషాచార్య అనీష్ వ్యాస్ ప్రకారం శని ప్రభావం కొన్ని సందర్భాల్లో శుభాన్నిస్తుంది.మీరు చేసే కర్మలకు మాత్రం శని ఫలితాన్నిస్తాడు..అందుకే అన్ని సందర్భాల్లో శనిని అశుభంగా భావించడం సరికాదంటారు పండితులు
శని దేవుడి ప్రభావం ఒక వ్యక్తికి సహనం, క్రమశిక్షణ ,ఓర్పు నేర్పుతుంది .. కొన్నిసార్లు వ్యక్తిని మరింత దృఢంగా చేస్తుంది.
శని సోదరి కావడంతో జ్యోతిష్యంలో భద్రను చెడుకి సూచనగా చూస్తారు. అందుకే భద్రకాలంలో ఏ శుభకార్యం ప్రారంభించకూడదు అని చెబుతారు.