Surya Grahanam 2025: అగ్ని తత్వ రాశులకు ఈ సూర్య గ్రహణం వల్ల ఎక్కువ ప్రమాదం! మీ రాశి ఉందా ఇందులో?
సెప్టెంబర్ 21 ఆదివారం సూర్యగ్రహణం రాత్రి 11 గంటలకు ఏర్పడుతుంది, ఇది భారతదేశంలో కనిపించదు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహణం కనిపించకపోయినా అది రాశులపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా అగ్ని మూలకాల రాశుల వారు గ్రహణం సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశిలోనూ ప్రత్యేక గుణాలు స్వభావం .. ప్రవృత్తి దాని మూలకంతో ముడిపడి ఉంటాయి. ఈ లక్షణాల ఆధారంగా రాశులను నీరు అగ్ని భూమి వాయువు అనే మూలకాలలో విభజించారు.
మేష సింహ ధను రాశులు అగ్ని తత్వ రాశులుగా పరిగణిస్తారు. ఇవి ధైర్యం, శక్తి, వేగం, నాయకత్వానికి చిహ్నంగా చెబుతారు. ఇవి ఎల్లప్పుడూ చురుకుగా, శక్తివంతంగా , ఆత్మవిశ్వాసంతో ఉంటాయి.
సూర్యుడు అగ్ని తత్వానికి చెందిన గ్రహం. గ్రహణం సమయంలో సూర్యుని శక్తి బలహీనపడుతుంది. అందువల్ల గ్రహణం సమయంలో మేషం, సింహం ధనుస్సు వంటి అగ్ని తత్వ రాశుల ప్రభావం కూడా బలహీనపడుతుంది.
అగ్ని తత్వంతో పాటు జల తత్వ రాశులైన కర్కాటకం, వృశ్చికం, మీనంపై కూడా సూర్యగ్రహణం ప్రతికూల ప్రభావం ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఈ రాశులలో సూర్యుని తేజస్సు ప్రభావం తగ్గుతుంది.
ఈ సమయంలో అగ్నితత్వ రాశులవారు సానుకూలంగా ఉండాలి. ఆలోచనల తీవ్రతను తగ్గించుకోవడం మంచిది