Transgender: హిజ్రా నుంచి రూపాయి నాణెం తీసుకుంటే అదృష్టం కలిసొస్తుందా?
హిజ్రాలకు ధాన్యం, వస్రాలు, డబ్బులు ఇస్తే శుభం జరుగుతుందని నమ్ముతారు. అయితే వారినుంచి తిరిగి ఒక్కరూపాయి తీసుకుంటే అది చాలా శుభప్రదంగా పరిగణిస్తారు
కొంతమంది అయితే హిజ్రాల నుంచి పొందిన రూపాయి నాణేన్ని గుడ్ లక్ తో పోలుస్తారు. నిజంగా హిజ్రాల నుంచి పొందిన ఒక రూపాయి నాణెం కెరీర్-వ్యాపారం కోసం శుభంగా పరిగణించబడుతుందా?
హిందూ ధర్మ శాస్త్రాలు, పురాణాల్లో కూడా హిజ్రాల గురించి ప్రస్తావన ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో హిజ్రాల సంబంధం బుధ గ్రహంతో ముడిపడి ఉంది. హిజ్రాలకు డబ్బు లేదా దానం ఇవ్వడం ద్వారా బుధ గ్రహం నుంచి శుభ ఫలితాలు లభిస్తాయని చెబుతారు.
హిజ్రాల నుంచి ఓ రూపాయి తీసుకుంటే మంచి జరుగుతుంది..మీరు అడగకుండా వారు ఇస్తే మీ జీవితంలో ఎదురవుతున్న కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయంటారు
ఒక రూపాయితో పాటు హిజ్రాల నుంచి 2, 5 లేదా 10 రూపాయలు పొందడం కూడా శుభప్రదం. హిజ్రాలను మీరు డబ్బులు అడగకూడదు. ఒకవేళ హిజ్రాలు తమ ఇష్టంతో మీకు డబ్బులు ఇస్తేనే, అప్పుడు దీని శుభ ఫలం లభిస్తుంది.
హిజ్రాల నుంచి పొందిన డబ్బులో సానుకూలత ఉంటుంది, దీనివల్ల జీవితంలో కూడా సానుకూల మార్పులు వస్తాయి. దానిని దేవుని ఆశీర్వాదంగా భావించి గౌరవించండి. దానిని ఖర్చు చేయడానికి బదులుగా ఎర్రటి వస్త్రంలో చుట్టి బీరువాలో లేదా పర్సులో ఉంచండి.