Sankranti Celebration : విజయనగరంలో కన్నుల పండుగగా సంక్రాంతి సంబరాలు
విజయనగరంలో తెలుగువారి సంస్కృతి ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాలు కన్నుల పండువగా జరిగాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని డిప్యుటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిధిగా హాజరైన కోలగట్ల మాట్లాడుతూ, తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి అని అన్నారు.
ముందుగా భోగి మంటతో సంబరాలు ప్రారంభమయ్యాయి. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులూ, గాలిపటాలు, బుడబుక్కలు, కోలాటాల నడుమ, సాంస్కృతిక ప్రదర్శనలతో సంబరాలు అంబరాన్ని అంటాయి.
విజయనగరంలో కన్నుల పండుగగా సంక్రాంతి సంబరాలు
హరిదాసు
సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఉన్నతాధికారులు సైతం తమ హోదాను పక్కనపెట్టి, ఈ సంబరాల్లో ఆడిపాడి అలరించారు.