✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

AP Tourism: ఏపీ పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని బాబా రామ్‌దేవ్‌ను కోరిన చంద్రబాబు

Shankar Dukanam   |  27 Jun 2025 03:12 PM (IST)
1

ఏపీ ప్రభుత్వం విజయవాడలో టూరిజం కాన్‌క్లేవ్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి కందుల దుర్గేశ్, యోగా గురువు బాబా రాందేవ్ లు పాల్గొని ప్రసంగించారు.

2

ఏపీ పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని ఆధ్యాత్మిక వేత్త, యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఆయన సమాజానికి చేస్తున్న సేవల్ని కొనియాడారు.

3

భవిష్యత్తు అంతా పర్యాటక రంగానిదే అని కొన్నేళ్ల కిందటే చెప్పానన్నారు చంద్రబాబు. అసలే ఏపీకి అద్భుతమైన సముద్ర తీరం ఉందని గుర్తుచేశారు.

4

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం అభివృద్ధి చెందేందుకు అన్ని చర్యలు చేపట్టాం, ఈ ఆగస్టు 15 లోగా అన్ని సేవలను ఆన్‌లైన్‌లో అందిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

5

ఏపీలో టెంపుల్‌ టూరిజం మరింత అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. కోనసీమ, హార్సిలీ హిల్స్‌, పాపికొండలను మరింత అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఏపీలో వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని బాబా రాందేవ్‌ను కోరారు.

6

పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించిన ప్రభుత్వం కూటమి సర్కార్ అన్నారు చంద్రబాబు. విదేశాల్లో ఉన్న భారతీయుల్లో 35 శాతం తెలుగువాళ్లే ఉన్నారని, విదేశాల్లో తెలుగువాళ్లే ఎక్కువ ఆదాయం సంపాదించడంపై హర్షం వ్యక్తం చేశారు.

7

నడిచే హోటల్ రూములుగా తీర్చిదిద్దిన కారవ్యాన్ లను ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆయన వెంట యోగా గురువు బాబా రాందేవ్, ఏపీ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేశ్ ఉన్నారు.

8

క్యారవాన్ వాహనం లోపల బెడ్లు, చిన్న కిచెన్ (స్టవ్, ఫ్రిడ్జ్), వాష్‌రూమ్, కుర్చీలు, టేబుల్, వై-ఫై, ఎసీ, టీవీ లాంటి సదుపాయాలు ఉన్నాయి. ఈ క్యారవాన్ ఒక చిన్న మొబైల్ హోటల్‌లా పనిచేస్తుందన్నారు చంద్రబాబు.

9

గతంలో ఐటీ అభివృద్ధి చెందినట్లు ఇప్పుడు టూరిజం డెవలప్ కావాలని ఆకాంక్షించారు. ఉద్యోగాలు పోతావని ఆందోళన చెందవద్దని.. స్కిల్స్ పెంచుకుని స్మార్ట్ వర్క్ చేయాలని యువతకు చంద్రబాబు సూచించారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • విజయవాడ
  • AP Tourism: ఏపీ పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని బాబా రామ్‌దేవ్‌ను కోరిన చంద్రబాబు
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.