శ్రీవారి ఆలయంలో వైభవోపేతంగా పుష్పయాగం
తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పుష్పయాగం ఆలయ అర్చకులు నిర్వహించారు.
మంగళవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు.
పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకం, ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు అర్చకులు.
మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు.
సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీ మలయప్ప స్వామి వారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
బ్రహ్మోత్సవాలలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు వివిధ వాహనాలపై భక్తులకి దర్శనమిచ్చిచారని, బ్రహ్మోత్సవాలలో స్వామి అమ్మవార్ల శ్రమకు పరిష్కారంగా ఈ పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ అని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.
శ్రీవారికి కైంకర్యాలల్లో తెలిసి తెలియక చేసిన తప్పులకు పరిష్కారంగా కూడా ఈ పుష్పయాగం నిర్వహించడం మరో ఆనవాయితీగా వస్తుందన్నారు.
పూర్వం పుష్పయాగాన్ని బ్రహ్మోత్సవంలో ఓ భాగంగా నిర్వహించే వారని, ప్రస్తుతం కాలక్రమేణా పుష్పయాగాన్ని నిలుపుదల చేసారన్నారు.
1980వ సంవత్సరంలో ఆగమ సలహా మండలి, జీయ్యర్ స్వాముల సలహాతో తిరిగి పుష్పయాగాన్ని ప్రారంభించినట్లు ఈవో తెలియజేశారు.
అప్పటి నుంచి బ్రహ్మోత్సవాల అనంతరం కార్తీక మాసంలోని శ్రవణానక్షత్రం రోజు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.
గత రెండేళ్ల పాటు కరోనా కారణంగా పుష్పయాగాన్ని నిర్వహించలేక పోయాంమన్న ఆయన, ఈ ఏడాది పుష్పయాగాన్ని వైభవంగా నిర్వహించుకుంటున్నాంమని తెలిపారు.
వివిధ రకాల పుష్పలను, పాత్రలను స్వామి వారికి అర్చక స్వాములు సమర్పిస్తారని, శ్రీవారి పుష్పయాగం సందర్భంగా అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జితసేవలను రద్దు చేసినట్లు టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలియజేశారు..
తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పుష్పయాగం ఆలయ అర్చకులు నిర్వహించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పుష్పయాగం ఆలయ అర్చకులు నిర్వహించారు.