Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై ఆర్టీసీ ఉచిత ప్రయాణం!
RAMA | 20 Jun 2025 01:10 PM (IST)
1
తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి. ఈ మేరకు RTC బస్సుల ఉచిత సర్వీసును స్థానిక అశ్విని ఆసుపత్రి కూడలిలో జూన్ 19న ప్రారంభించారు
2
తిరుమలలో ప్రైవేట్ వాహనాలు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాయ్ వాటికి అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు వెంకయ్య చౌదరి
3
అధిక ఛార్జీలకు చెక్ పెట్టడంతో పాటూ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, కాలుష్యాన్ని నియంత్రించేందుకు RTC ఉచిత సర్వీసులు ఉపయోగపడతాయన్నారు.
4
శ్రీవారి ధరరథాలు ఏఏ మార్గాల్లో తిరుగుతున్నాయో అవే మార్గాల్లో ఆర్టీసీ బస్సులు కూడా ఉచితంగా సేవలందించనున్నాయి.
5
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు..ప్రతి మూడు నాలుగు నిముషాలకు ఉచిత ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి