Garuda Seva : తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
ABP Desam | 08 Dec 2022 09:01 PM (IST)
1
తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది.
2
ప్రతి నెల పౌర్ణమి నాడు మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై అధిరోహించి భక్తులను కటాక్షించడం ఆనవాయితీగా వస్తోంది.
3
గురువారం రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
4
తిరుమాఢ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి వారికి భక్తులు కర్పూర నీరాజనాలు పలికారు.
5
గరుడ వాహనంపై విహరిస్తున్న మలయప్ప స్వామి వారిని దర్శనంతో సప్తగిరులు గోవింద నామస్మరణతో మారుమోగాయి.
6
108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
7
గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు.