Gajavahana seva: గజ వాహనంపై విహరించిన మలయప్ప స్వామి
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు...గజ వాహనంపై మలయప్ప కటాక్షం
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు మంగళవారం రాత్రి శ్రీవారు గజ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
గజ వాహనం - కర్మ విముక్తి. రాజులను పట్టాభిషేకం సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. ఈ వాహనసేవ దర్శనం వల్ల కర్మ విముక్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది.
స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ఉత్సవాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలుపంచుకుంటాయి.
వాహన సేవలో పెద్ద జీయంగార్ స్వామి, చిన్న జీయంగార్ స్వామి, ఈవో కేఎస్.జవహర్‌రెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు ప్రశాంతి రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు, వీజీవో బాలిరెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజైన బుధవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై మలయప్పస్వామి వారు దర్శనమిస్తారు.
2021 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు...గజ వాహనంపై మలయప్ప కటాక్షం