In Pics : స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో విహరించిన శ్రీవారు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన ఆదివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శ్రీవారి బంగారు రథంలో భక్తులకు దర్శనమిచ్చారు.
దాసభక్తుల నృత్యాలు, భజనబృందాల కోలాహలం, మంగళవాయిధ్యాల నడుమ తిరు మాడవీధులలో స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణరథాన్ని లాగారు.
స్వామివారికి కృష్ణావతారంలో దారుకుడు సారథి, శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకాలనేవి నాల్గు గుర్రాలు. శ్రీవారి ఇల్లు బంగారం, ఇల్లాలు బంగారం, ఇంట పాత్రలు, సింహాసనం బంగారుది, కావున స్వర్ణరథం శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది.
స్వర్థ రథంపై శ్రీవారు
స్వర్ణమంటే బాగా ప్రకాశించేది అని అర్థం. స్వర్ణం లభించేది భూమి నుంచే కనుక ఇరువైపులా శ్రీదేవి, భూదేవీ ఉండగా శ్రీవారుమధ్యలో ఉండి, స్వర్ణరథంలో ఊరేగడం-స్వామి వారి మహోన్నతిని సూచిస్తుంది.
ఈ స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల లక్ష్మీదేవి కరుణతో బంగారు, సంపదలు, భోగభాగ్యాలు సుఖాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. ఆరోవ రోజు రాత్రి గజవాహనంపై ఊరేగుతూ శ్రీవారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు.
స్వర్థరథాన్ని చూసేందుకు తరలివచ్చిన భక్తులు
తిరుమాడ వీధుల్లో స్వర్ణరథం
స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో విహరించిన శ్రీవారు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన ఆదివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శ్రీవారి బంగారు రథంలో భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు