TDP Protest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణుల కాంతితో క్రాంతి, వెలిగిన క్యాండిల్స్, కాగడాలు
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా శనివారం రాత్రి కాంతితో క్రాంతి కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, అభిమానులు, మద్దతుదారులు భారీగా పాల్గొన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు ఐదు నిమిషాల పాటు ఇళ్లలోని లైట్లు ఆఫ్ చేశారు. అనంతరం ఇంటి బయటకు వచ్చి దీపాలు, కొవ్వొత్తులు తెలిగించి చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు.
అన్ని జిల్లాల్లో టీడీపీ శ్రేణలు, అభిమానులు దీపాలు, కొవ్వొత్తులు వెలిగించి ఈ కార్యక్రమంలో స్వచ్చంధంగా పాల్గొన్నారు. ఇళ్ల బయట, వాకిళ్లు, వీధుల్లో దీపాలు వెలిగించారు.
అటు రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి దీపాలు వెలిగించగా.. హైదరాబాద్‌లో నారా భువనేశ్వరి కొవ్వొత్తులు వెలిగించారు.
ఇక ఎన్టీఆర్ భవన్ వద్ద ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయడు, టీడీపీ నేతలు దీపాలు వెలిగించారు.
ఇళ్ల బయట, వాకిళ్లు, వీధుల్లో దీపాలు వెలిగించారు. అలాగే రోడ్లపై ఉన్నవారు వాహనాల లైట్లు బ్లింగ్ చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు.
అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. నిజాయితీగా రాజకీయాలు చేసిన పున్నమి చంద్రుడు చంద్రబాబు అని, చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చి రాష్ట్రంలో వెలుగులు నింపాలని అన్నారు.
అక్రమ కేసులో అరెస్ట్ చేసి చంద్రబాబును జైల్లో ఉంచారని, ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని ఆరోపించారు.
శనివారం ఉదయం ఢిల్లీ వెళ్లిన నారా లోకేష్.. హస్తినలోనే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ నేతలతో కలిసి కాంతితో క్రాంతి కార్యక్రమం నిర్వహించారు.
ఈ నిరసన కార్యక్రమానికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా మద్దతు ప్రకటించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నేతలందరూ నినదించారు.