Sri Krishna Janmashtami: తిరుమలలో శ్రీవారికి నవనీత సేవ
శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారికి నవనీత సేవ అంగరంగ వైభవంగా జరిగింది.
టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో కెఎస్.జవహర్‌రెడ్డి గోశాల నుంచి వెన్న తీసుకుని ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుని అర్చకులకు అందజేశారు.
టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో కెఎస్.జవహర్‌రెడ్డి గోశాల నుంచి వెన్న తీసుకుని ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుని అర్చకులకు అందజేశారు.
నవనీత సేవలో వెన్న తీసుకెళ్లి స్వామివారికి సమర్పించేందుకు గాను 1 కిలో 12 గ్రాముల వెండి గిన్నెను టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి విరాళంగా అందజేశారు.
గోశాలలో దేశవాళీ గోవుల పాలతో పెరుగు తయారుచేసి, దాన్ని సంప్రదాయబద్ధంగా కవ్వాలతో చిలికి వెన్న తీస్తారని సుబ్బారెడ్డి చెప్పారు.
వెన్నెను ప్రతిరోజు గోశాల నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు తీసుకొచ్చి అర్చకులకు అందజేస్తారని వివరించారు.
అర్చకులు వెన్నెను స్వీకరించి.. శ్రీవారి కైంకర్యాలకు వినియోగిస్తారని తెలిపారు. వెన్న తయారీ, వెన్న ఊరేగింపులో శ్రీవారి సేవకులు పాల్గొంటారని వివరించారు.
కృష్ణాష్టమి సందర్భంగా గోశాల ప్రాంగణాన్ని రంగవళ్లులు, పుష్పాలతో అలంకరించారు.
నవనిత సేవ సందర్భంగా చిన్నికృష్ణులు, గోపికల వేషధారణ ఆకట్టుకున్నాయి.