ఫోటోలు: నిరాహార దీక్షలో నారా భువనేశ్వరి, బాబుకు మద్దతుగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నేతలు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు.
గాంధీ జయంతి రోజున సత్యమేవజయతే పేరుతో దీక్షలకు కూర్చున్నారు.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో తన అక్రమ అరెస్టుకు నిరసనగా చంద్రబాబు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
ఆయనకు సంఘీభావంగా రాజమండ్రిలోనే ఉన్న ఆయన సతీమణి నారా భువనేశ్వరి దీక్షబూనారు.
సత్యమేవ జయతే పేరుతో తలపెట్టిన నిరహార దీక్షకు వెళ్ళే ముందు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు
రాజమండ్రి జైలులో చంద్రబాబు, బయట నారా భువనేశ్వరిలు చేపట్టిన దీక్షలకు మద్దతుగా ఢిల్లీలో యువనేత నిరాహార దీక్ష చేపట్టారు.
వీరి దీక్షలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు దీక్షలు చేపట్టారు.
వివిధ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్షలు కొనసాగాయి.
పిల్లలు సైతం ఈ దీక్షల్లో చురుగ్గా పాల్గొన్నారు.