Chandra Babu Visits Polavaram Project: 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - కీలక ప్రకటన చేసిన చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ(27 మార్చి 2025) పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.
ప్రాజెక్టు వద్దకు చేరుకోగానే ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు.
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి గురించి తెలుసుకున్నారు చంద్రబాబు.
పనులు జరుగుతున్న తీరుపై ప్రాజెక్టు వద్దే అధికారులతో సమీక్ష జరిపారు.
పోలవరం నిర్వాసితులతో కూడా చంద్రబాబు మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు.
నిర్వాసితులకు రూ.829 కోట్లు నేరుగా అందజేశామని మరికొంత నిధులు అందజేస్తామని వెల్లడించారు.
పోలవరంలో నీళ్లు పారడానికి ముందే అంటే 2027 నవంబర్ నాటికి నిర్వాసితులకు పునరావాసం పూర్తి చేస్తామనని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో పనులు జరగలేదని మండిపడ్డారు.
నిర్వాసితులకు భారీగా హామీలు ఇచ్చిన జగన్ వాటిని కూడా అమలు చేయలేదని గుర్తు చేశారు.
ఇప్పుడు అలాంటి భయం లేదని నిర్వాసితులకు భరోసా ఇచ్చారు చంద్రబాబు