Jagan Mohan Reddy: పోలీస్ సంస్మరణ సభలో సీఎం జగన్ నివాళులు..
విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం శ్రీ వైయస్.జగన్.
అనంతరం పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన సీఎం
కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, ఇతర ప్రజా ప్రతినిధులు, పలువురు ఉన్నతాధికారులు హాజరు
అమరవీరుల పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
దేశంలోనే మొట్టమొదటిసారిగా వారికి వీక్లీఆఫ్ ప్రకటించిన ప్రభుత్వం వైసీపీదేనని సీఎం జగన్ చెప్పారు.
ఏడాది కాలంగా దేశ వ్యాప్తంగా 377 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని.. మన రాష్ట్రానికి చెందిన 11 మంది ఉన్నారని తెలిపారు.
అమరులైన పోలీసుల కుటుంబసభ్యులకు ఆర్దిక సాయం అందించిన సీఎం శ్రీ వైయస్.జగన్.