Ontimitta Navami Celebrations: వాహనంపై శ్రీరాముడి సాక్షాత్కారం
ఒంటిమిట్ట కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గో రోజు బుధవారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై అభయమిచ్చారు.
రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది.
కళాబృందాల కోలాటాలు ఆకట్టుకున్నాయి.
భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం చెబుతోంది.
హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో హనుమద్వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తిస్తారు.
image 7
ఒంటిమిట్ట కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గో రోజు బుధవారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై అభయమిచ్చారు.