In Pics : ఆ'రేంజ్' చూస్తే బాపురే అంటారు, కమలాచెట్టుకు రెండు వేల కాయలు
కడియపులంక కమలాచెట్టుకు రెండు వేల కాయలు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమనకు కుండీలలో ఉండే కమలా మొక్కలు అరుదుగా కనపడతాయి. అక్కడక్కడ అందం కోసం ఈ మొక్కలు పెంచుకున్నప్పటికీ పది నుంచి పాతిక కాయలు ఉండటం విశేషం.
కుండీలో ఉండే ఒకే కమాల చెట్టుకు రెండు వేల కమలాలుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు.
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడిపులంక శివంజనేయ నర్సరీలో ప్రస్తుతం ఆ అరుదైన కమలా చెట్లు సందడి చేస్తున్నాయి.
కుండీలో పెరిగే ఈ కమలా చెట్టుకు రెండు వేల కాయలు కాశాయా అంటే.. అనుమానం వ్యక్తం చేసే వాళ్లు వచ్చి లెక్కపెట్టుకోవచ్చు అంటున్నారు నర్సరీ నిర్వాహకులు.
కాస్త అటు ఇటుగా కచ్చితంగా 2 వేల కమలాలు కాస్తున్నాయని రైతు చెబుతున్నారు. కార్పొరేట్ సంస్థలు, ఫంక్షన్ హల్స్ వద్ద వీటిని ప్రత్యేక ఆకర్షణగా పెట్టేందుకు కొనుగోలు చేసి తీసుకెళ్లుతున్నారు. ఎనిమిది నుంచి పది సంవత్సరాల వయసు ఉండే ఈ చెట్టు ధర రూ. 25-35 వేల వరకు పలుకుతుంది.
అరుదైన మొక్కలను మన దేశ నర్సరీ రంగానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో వీటిని దిగుమతి చేస్తున్నట్లు నర్సరీ రైతు మల్లు పోలరాజు తెలిపారు.