Jagananne Maa Bhavishyathu: రాష్ట్రవ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ప్రారంభం
రాష్ట్ర వ్యాప్తంగా మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం ప్రారంభం
ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాల గురించి వివరిస్తున్న ప్రజా ప్రతినిధులు
పెద్ద ఎత్తున పాల్గొన్న ఎమ్మెల్యేలు, గృహ సారథులు కన్వీనర్లు
ప్రజల అభిప్రాయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న నేతలు
ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనున్న జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం
గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా తెలియచేస్తూ ఐదు ప్రశ్నలు అడుగుతారు.
ప్రతి ఇంటికి కుటుంబ అనుమతితో జగన్ ఫోటో ఉన్న స్టిక్కర్ అతికిస్తారు.
సెల్ ఫోన్ పై కూడా అతికించే స్టిక్కర్ ఇస్తున్న నేతలు
కోటి 60 లక్షల ఇళ్లలో కార్యక్రమం అమలు
ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ఉపయోగపడనున్న కార్యక్రమం
ప్రజల మద్దతు కొరడమే ప్రధాన అజెండా..
కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతుందని వైసీపీ నేతలు వెల్లడి
సంతృప్తి చెందితేనే ఆశీస్సులు ఇవ్వండి అంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రచారం
ప్రత్యేకంగా ముద్రించిన కరపత్రాన్ని ప్రజల దగ్గరకి తీసుకు వెళ్తున్న నేతలు
ఏపీ సీఎం జగన్ పాలనపై అభిప్రాయం 82960 82960 నంబర్ కు తెలియచేయాలని సూచన