CM Chandrababu: అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన - రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో సాష్టాంగ నమస్కారం
అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. ఆయన వెంట మంత్రి నారాయణ, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
వైసీపీ హయాంలో కూల్చేసిన ప్రజావేదికను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఆ ప్రాంతం నుంచి ఆయన పర్యటన ప్రారంభించారు.
అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు పూర్తి కాని బిల్డింగులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
అమరావతిలో నిర్మాణాలు, ప్రస్తుత పరిస్థితిని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు.
అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా అక్కడకు వచ్చిన ప్రజలకు ఆయన అభివాదం చేశారు.
అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు పూర్తి కాని బిల్డింగులను సీఎం చంద్రబాబు పరిశీలించారు.
ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో సీఎం చంద్రబాబు మోకాళ్లపై కూర్చుని నమస్కారం చేశారు.
రాజధాని శంకుస్థాపన చేసిన ప్రాంతంలో సీఎం చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేస్తూ ప్రణమిల్లారు.
ఉద్దండరాయునిపాలెంలోని రాజధాని ప్రాంత రైతులు, మహిళలను సీఎం చంద్రబాబు కలిశారు.