Amit Shah Andhra Pradesh visit : ఆంధ్రప్రదేశ్ చేరుకున్న హోంమంత్రి అమిత్‌షా- వచ్చిన వెంటనే ఏం చేశారంటే?
ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చిన హోంమంత్రి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ ఘన స్వాగతం పలికారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచంద్రబాబు నివాసంలోనే అమిత్‌షా పవన్ కల్యాణ్, పురందేశ్వరి ఇతర సీనియర్ నేతలంతా కలిసి డిన్నర్ చేశారు. విందు సమావేశం ముగిసిన తర్వాత అమిత్‌షా విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్‌కు చేరుకొని అక్కడే బస చేయనున్నారు.
ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు.
ఉదయం 11:30 గంటలకు కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 10వ బెటాలియన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సౌత్ క్యాంపస్ భవనాలు ప్రారంభిస్తారు.
ఈ ప్రోగ్రామ్‌లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తోపాటు మంత్రులు కూటమి నేతలు హాజరుకానున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పాటు అమిత్‌షా పర్యటించనున్నారు.