✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

CM Chandrababu Naidu 30 Years : ముఖ్యమంత్రిగా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబు అరుదైన చిత్రాలు చూశారా!

Khagesh   |  01 Sep 2025 05:49 PM (IST)
1

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం చేసి నేటికి 30 ఏళ్లు పూర్తి అయ్యింది. 1995 సెప్టెంబర్ 1న సీఎంగా మొదటిసారి ప్రమాణం చేశారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఆ పదవిని చేపట్టారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయిన ఘనత కలిగిన తెలుగు నాయకులు నారా చంద్రబాబునాయుడు ఒక్కరే.

2

1995లో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పాలనలో తన మార్క్‌ చూపించారు. అప్పటి వరకు సాగుతున్న మూస ధోరణి పాలనకు ఫుల్‌స్టాప్ పెట్టి కొత్త పుంతలు తొక్కించారు. నాటి నుంచి నేటి వరకు వినూత్న కార్యక్రమాలు చేపట్టి దూరదృష్టి కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు.

3

ఎన్టీఆర్‌ను పదవి నుంచి తొలగించి తెలుగుదేశం పగ్గాలు, ఇటు ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు చాలా సమర్థవతంగా రెండింటిలో చాలా మార్పులు తీసుకొచ్చారు. మామకు వెన్నుపోటు పొడిచే వ్యక్తిగత ప్రత్యర్థులు విమర్శలు చేస్తూన్నా ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రజలకు చెప్పడంలో విజయవంతమయ్యారు.

4

టీడీపీ శ్రేణులు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేవునిగా భావించే ఎన్టీఆర్ లాంటి వ్యక్తిని పదవి నుంచి తొలగించి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ పగ్గాలు, పాలనా బాధ్యతలు చేపట్టడం సాహసమే అని చెప్పాలి. మామను దించేశారనే అపఖ్యాతి జీవితాంతం మోయాల్సి ఉంటుందని తెలిసి కూడా ముందడుగు వేశారు.

5

1995 నుంచి 2025 వరకు పాలనా పగ్గాలు చేపట్టిన ప్రతిసారి తన మార్క్‌ పాలనతో ప్రజలను మెప్పించారు. తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత గెలవడం కష్టం అనుకున్నారు. కానీ 1999లో చంద్రబాబు 44.14 ఓట్ల శాతంతో 181 సీట్లతో విజయం సాధించారు.

6

1999లో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పటికి ఎన్టీఆర్ పేరుతో ఆయన కుటుంబానికి చెందిన వాళ్లు పార్టీలు పెట్టి భంగపడ్డారు. నిజమైన తెలుగుదేశంగా చంద్రబాబు నాయకత్వంలోని పార్టీ ప్రజల మన్ననలు పొందింది. ఆ తర్వాత మళ్లీ అలాంటి ప్రస్తావన రాలేదు.

7

2004, 2009లో కాంగ్రెస్ చేతిలో చంద్రబాబు ఓడిపోయారు. తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, పార్టీలోని వారంతా వలసలు పోవడంతో, అప్పటికి లోకేష్ ఇంకా రాజకీయ అరంగేట్రం చేయకపోవడంతో చంద్రబాబు పని అయిపోయిందని, చంద్రబాబు కోలుకోవడం కష్టమని భావించారు. 2014కు ముందు చంద్రబాబు పాదయాత్ర చేపట్టారు. ప్రజలను మెప్పించారు. మళ్లీ 2014లో సీఎంగా ప్రమాణం చేశారు.

8

తర్వాత 2019లో చంద్రబాబు ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. ఈసారి తెలుగు దేశం చరిత్రలోనే అత్యంత దారుణమైన పరాభవం ఎదుర్కొన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత ఆపార్టీలోని చాలా మంది వైసీపీలోకి వెళ్లిపోయారు. ప్రతిపక్షం పోయే ప్రమాదంలో పడింది. కానీ లోకేష్ చేసిన పాదయాత్ర, చంద్రబాబు అరెస్టు, పవన్, మోదీతో పొత్తు కారణంగా మళ్లీ చంద్రబాబుకు పగ్గాలు అప్పగించారు ప్రజలు.

9

చంద్రబాబు ఓ రాజకీయ నాయకుడిగా కంటే ఓ సంస్కరణకర్తగా, హైటెక్‌ సీఎంగా, రాష్ట్రానికి సీఈవోగా చెబుతుంటారు. పెద్ద స్థాయిలో ఆలోచనలు చేసి వాటిని అమలు చేయడంలో ఆయనకు మించిన వారే లేరు. విజన్ 2020 నుంచి నేటి స్వర్ణాంధ్ర 2040 వరకు సేమ్ ఫార్ములా.

10

మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు జన్మభూమి అని ప్రవేశ పెట్టారు. కార్యాలయాలకే పరిమితమైన పాలనను ఇంటి ముందుకు తీసుకొచ్చేందుకు ప్రజల వద్దకు పాలన అంటూ తన మార్క్ చూపించారు.

11

నీటిని కాపాడుకోవడం కోసం నీరు- మీరు, చెట్లు పెంచి పర్యావరణం పరిరక్షించేందుకు పచ్చదనం- పరిశుభ్రత, పాలనలో పారదర్శకత పెంచేందుకు ఈ గవర్నెన్స్‌, ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ప్రజలతో ముఖ్యమంత్రి కార్యక్రమం దేశంలోనే ఏపీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి.

12

అందులో భాగంగానే 1998 నవంబర్‌ 12న హైటెక్ సిటీని పూర్తి చేశారు. బిల్‌గేట్స్‌ లాంటి వాళ్లను ఏపీకి తీసుకొచ్చి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. నేటి హైటెక్ వృద్ధికి నాడు బీజం వేశారు చంద్రబాబు.

13

విద్యుత్ సంస్కరణలు చేపట్టారు. అప్పటి వరకు కరెంటు లేని ఊళ్లను మాత్రమే చూశారు. ఆ పరిస్థితి క్రమంగా నిర్మూలించారు. విద్యుత్ చౌర్యాన్ని భారీగా అరికట్టారు. తర్వాత కాలంలో ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ఆయన చేపట్టిన సంస్కరణలే కారణమని విశ్లేషకులు చెబుతుంటారు.

14

పాలనా పరంగానే కాకుండా ప్రజల అభివృద్ధికి కూడా చర్యలు చేపట్టారు. మహిళలు వ్యాపారవేత్తలుగా మారేందుకు డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చారు. వెలుగు అనే కార్యక్రమం తీసుకొచ్చారు.

15

విద్య,వైద్య రంగంలో వృద్ధి చెందడానికి పలు చర్యలు తీసుకున్నారు. మహిళల ఆరోగ్యం కోసం దీపం పథకం తీసుకొచ్చి వారికి గ్యాస్ కనెక్షన్‌లు అందించారు.

16

image 19

17

ఆడపిల్లలు చదువుకు ఆటంకం రాకుండా ఉండేందుకు సైకిళ్లు పంపిణీ చేశారు. రైతులు తమ పంటను నేరుగా వినియోగదారులకే అమ్ముకునేందుకు రైతుబజార్లను తీసుకొచ్చారు.

18

ముఖ్యమంత్రిగా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబు అనేక మంది ప్రపంచస్థాయి ప్రముఖులను ఆంధ్రప్రదేశ్ రప్పించారు.

19

నాటి నుంచి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి హైటెక్‌ విధానాలు అవలంభించేవాళ్లు

20

హైదరాబాద్‌ను సైబరాబాద్‌గా మార్చారు చంద్రబాబు. సాంకేతిక రంగానికి ప్రాధాన్యత ఇచ్చి హైటెక్ సిటీ, జెనోమ్‌ వ్యాలీ, ఐటీ పాలసీలు తీసుకొచ్చి ప్రపంచ ఐటీ దిగ్గజాలను ఆకర్షించారు.

21

గత పదేళ్ల నుంచి పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశారు. పోలవరం వంటి నీటిపారుదల ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్న చంద్రబాబు

22

ఇ-సేవ కేంద్రాలు, రియల్‌టైమ్ గవర్నెన్స్ ద్వారా పారదర్శకత, పాలనలో వేగవంతమైన చర్యలు తీసుకున్నారు.

23

జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. వాజ్‌పేయి ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించారు.

24

ఏపీ విభజన తర్వాత రాష్ట్రం కోసం కొత్త రాజధాని అమరావతిని ప్రారంభించి, అభివృద్ధికి బాటలు వేసేదిశగా చర్యలు తీసుకుంటున్నారు చంద్రబాబు

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • అమరావతి
  • CM Chandrababu Naidu 30 Years : ముఖ్యమంత్రిగా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబు అరుదైన చిత్రాలు చూశారా!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.