Pawan Kalyan: పింఛన్ సొమ్ముతో మొక్కులు తీర్చిన బామ్మ- పిలిచి కాళ్లు మొక్కిన పవన్
పిఠాపురంలో ఉంటున్న ఓ వృద్ధురాలి ప్రేమకు ఏపీ డీసీఎం పవన్ కల్యాణ్ ముగ్ధులైపోయారు.
పింఛన్‌తో మొక్కులు తీర్చిన విషయం తెలుసుకొని పోతుల పేరంటాల కాళ్లకు మొక్కారు
గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విజయాన్ని కాంక్షిస్తూ వేగులమ్మ అమ్మవారికి మొక్కుకున్నారు పోతుల పేరంటాలు
పవన్ విజయం సాధించిన తర్వాత తన పింఛను సొమ్ముతో మొక్కులు చెల్లించారు పోతుల పేరంటాలు.
పోతుల పేరంటాలది పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లి
పింఛను సొమ్ము దాచుకొని అమ్మవారికి రూ.27వేల విలువైన గరగ చేయించి ఇచ్చారు పోతుల పేరంటాలు.
పోతుల పేరంటాలు చేసిన పని తెలుసుకున్న పవన్ తన క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి ముచ్చటించారు.
పవన్ ఆహ్వానం మేరకు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి పేరంటాలు వచ్చారు.
శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పేరంటాలతో కలసి భోజనం చేశారు.
స్వయంగా భోజనం వడ్డించారు. చీరను బహూకరించారు.
పింఛను సొమ్ముతో మొక్కులు చెల్లించిన విషయం తెలుసుకుని ఆర్థిక సాయం అందించారు పవన్.
పేరంటాలను క్యాంపు కార్యాలయంలోకి ఆత్మీయంగా ఆహ్వానించిన తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు.
పవన్ కల్యాణ్ పేరంటాలను వాహనం వరకు స్వయంగా వచ్చి సాగనంపారు.