Nara Lokesh: మంగళగిరి ఎమ్మెల్యేగా ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్న నారా లోకేష్
టీడీపీ నేత నారా లోకేష్ మంగళగిరి నుంచి మరోసారి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఓడిన చోటే నెగ్గాలని అక్కడే పోటీ చేసి రికార్డులు తిరగరాశారు
కాలర్ మడతపెట్టడం కాదు, ఈ ఎన్నికల్లో కుర్చీలు మడతపెట్టాలని నారా లోకేష్ పలు సందర్భాలలో మాట్లాడుతూ టీడీపీ శ్రేణులలో నూతనోత్సాహాన్ని నింపారు.
మంగళగిరి నియోజకవర్గంలో 91,413 ఓట్ల మెజారిటీ ఇచ్చిన ప్రజలకే ఈ విజయం అంకితం చేశారు నారా లోకేష్
అందరం కలిసి మంగళగిరి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుందాం అన్నారు. అఖండ విజయం అందించిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలు, టిడిపి నేతలు, కార్యకర్తలు, మంగళగిరి ఆఫీసు సిబ్బంది, మీడియా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
కూటమికి అద్భుత విజయాన్ని అందించిన ప్రజలందరికీ నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. సమిష్టిగా పనిచేస్తూ ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర పునర్నిర్మాణం తమ లక్ష్యమన్నారు.