Nara Family Photos: తోడళ్లుళ్ల హ్యాట్రిక్ విజయం - బాలయ్య, చంద్రబాబును కలిసిన లోకేశ్, శ్రీభరత్
టీడీపీ భారీ విజయాన్ని నమోదు చేయడం పట్ల ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి.
టీడీపీ అభ్యర్థులుగా నందమూరి, నారా కుటుంబం నుంచి కూడా వివిధ స్థానాల నుంచి పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే.
నందమూరి బాలక్రిష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా వరుసగా మరోసారి గెలుపొందారు.
బాలక్రిష్ణకు హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి దీపిక టీఎన్‌పై 32597 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది.
మరోవైపు, చంద్రబాబు తనయుడు, బాలక్రిష్ణ పెద్ద అల్లుడు నారా లోకేశ్ మంగళగిరిలో కనీవినీ ఎరగని మెజారిటీ సాధించారు.
పడిన చోటే నిలదొక్కుకున్న నారా లోకేశ్ ఏకంగా మంగళగిరిలో వైసీపీ అభ్యర్థిపై 91413 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు.
ఇంకోవైపు, బాలక్రిష్ణ చిన్న అల్లుడు మతుకుమిల్లి శ్రీభరత్ విశాఖపట్నం పార్లమెంటు స్థానంనుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
శ్రీభరత్ కూడా విశాఖలో బొత్స ఝాన్సీ లక్ష్మీపై 504247 ఓట్ల మెజారిటీ సాధించారు.
బాలక్రిష్ణ ఇద్దరు ఎన్నికల్లో గెలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా శ్రీభరత్, బాలక్రిష్ణ, నారా లోకేశ్, చంద్రబాబు ఒకచోట కలుసుకున్నారు.
బాలక్రిష్ణ కుమార్తెలు నారా బ్రాహ్మణి, తేజస్విని కూడా అక్కడ ఉన్నారు.
గెలుపు పట్ల ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
నారా లోకేశ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్న