CRDA Office in Amaravati: గ్రాఫిక్స్‌ను నిజం చేసి చూపించిన చంద్రబాబు.. సీఆర్‌డీఏ ఆఫీస్ వద్ద ఏపీ సీఎం
మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం ప్రారంభించారు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులతో కలిసి భవనాన్ని ప్రారంభించారు.
సోమవారం ఉదయం 9.54 గంటలకు సీఆర్డీఏ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. రాజధాని పనులు రీ-స్టార్ట్ అయ్యాక ప్రారంభమైన తొలి ప్రభుత్వ భవనం ఇది.
G+7 భవనంతో పాటు మరో నాలుగు PEB భవనాలను ఏపీ ప్రభుత్వం నిర్మించింది. సీఆర్డీయే, ఏడీసీఎల్ తో పాటు మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని విభాగాలు ఒకే చోట నుంచి కార్యకలాపాలు నిర్వహించేలా నిర్మాణాలు చేసిన ప్రభుత్వం.
రైతులు భూములిచ్చి రాజధాని అమరావతి నిర్మాణానికి సహకరించారని సీఎం చంద్రబాబు అన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు
సీఆర్డీయే కార్యాలయం ప్రారంభం అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధాని రైతులకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూస్తాం. రైతులకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం అన్నారు.
భవనాన్ని ప్రారంభించిన అనంతరం పరిశీలిస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, భవన నిర్మాణ తీరును వివరిస్తోన్న మంత్రి నారాయణ.
రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించే బాధ్యతను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ లకు చంద్రబాబు అప్పగించారు.
రాజధాని అమరావతి రైతులతో నిరంతరం మాట్లాడుతూ.. వారి సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యతను ఈ ముగ్గురు తీసుకుంటారని చంద్రబాబు స్పష్టం చేశారు. అప్పటికీ ఇంకా పరిష్కారం కాని సమస్యలేమైనా ఉంటే తాను బాధ్యత తీసుకుంటానని తెలిపారు.
4.32 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్ 7(G+7) భవనం 3 లక్షల 7వేల 326 చదరపు అడుగులలో నిర్మించారు. ప్రధాన భవనం 0.73 ఎకరాలు, ఓపెన్ స్పేస్ 0.96 ఎకరాలు, గ్రీన్ జోన్ 0.88 ఎకరాలు, పార్కింగ్ ఏరియా 1.36 ఎకరాలు, ఎస్టీపీ 0.39 ఎకరాల్లో పూర్తి చేశారు.
సీఆర్డీఏ భవనం ప్రారంభానికి ముందు భూములిచ్చిన రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. త్వరలోనే భూములిచ్చిన రైతులతో సమావేశమవుతానని సీఎం తెలిపారు.