Arattai challenges WhatsApp with UPI strategy: దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం జోహో కార్పొరేషన్ ఇటీవల విడుదల చేసిన "అరత్తై" మెసేజింగ్ యాప్ హాట్ టాపిక్ గా మారింది. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించాలని మోదీ పిలుపుతో ఈ యాప్ పై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ యాప్ వాట్సాప్‌కు గట్టి పోటీనివ్వడానికి, భారతదేశంలోని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) రెగ్యులేషన్లను అనుసరించి, ఓపెన్ , ఇంటర్ ఆపరేబిల్ మెసేజింగ్ ప్లాట్‌ఫారం అవుతుందని జోహో చెబుతోంది.
అరత్తై వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా భారతదేశంలోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ప్రధాన లక్షణం ఇది UPI వంటి ఓపెన్ స్టాండర్డ్‌లను అనుసరిస్తుంది., అంటే వినియోగదారులు ఒక ప్లాట్‌ఫారం నుండి మరో ప్లాట్‌ఫార్మ్‌కు సులభంగా మైగ్రేట్ చేయగలరు. "మేము వాట్సాప్ వంటి యాప్‌లను కాదు, ఇ మెయిల్ , UPI వంటి ఇంటరాపరేబిల్ సిస్టమ్‌లను కోరుకుంటున్నాం" అని జోహో సీఈవో శ్రీధర్ వెంబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఈ యాప్ యొక్క ప్రారంభం తర్వాత గంటల వ్యవధిలోనే 3,000 నుండి 3,50,000 సైన్ అప్‌లకు చేరుకుందని వెంబు పేర్కొన్నారు. ఇది భారతదేశంలోని డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఈ విజయాన్ని గుర్తించి, ఎడెల్‌వైస్ మ్యూచువల్ ఫండ్స్ సీఈవో రాధికా గుప్తా సైతం వెంబును అభినందించారు. "ఇండియన్ బ్రాండ్‌లు గ్లోబల్ స్టేజ్‌పై నిలబడాలని కోరుకుంటున్నాను" అని ఆమె పేర్కొన్నారు."మేము iSpirtతో చర్చలు ప్రారంభించాం, ఇది UPI టెక్నికల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది. మేము మెసేజింగ్ ప్రోటోకాల్స్‌ను స్టాండర్డ్‌చేసి పబ్లిష్ చేయాలని కోరుకుంటున్నాం" అని శ్రీధర్ వెంబు చెబుతున్నారు.
వాట్సాప్ భారతదేశంలో 500 మిలియన్ కంటే ఎక్కువ వినియోగదారులతో ఒక ఆధిపత్యం సాధించింది. అయితే, అరత్తై UPI-ఇన్‌స్పైర్డ్ మోడల్ వాట్సాప్‌ను సవాలు చేయడానికి సిద్ధమైంది. "వాట్సాప్ మెటా ఎకోసిస్టమ్‌లో ఇంటిగ్రేషన్, డేటా షేరింగ్‌పై ఉన్న ఆందోళనలను అరత్తై అధిగమిస్తుంది" అని వెంబు పేర్కొన్నారు. అరత్తై "మేడ్ ఇన్ ఇండియా, ఫర్ ది వరల్డ్" ట్యాగ్‌లైన్ దానిని గ్లోబల్ మార్కెట్‌లో కూడా రాణించేలా చేస్తుదంని నమ్ముతున్నారు.
వాట్సాప్‌ను మార్కెట్‌లోని ప్రధాన ప్లేయర్‌గా మార్చిన ఫీచర్లు - ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, గ్రూప్ చాట్స్, మల్టీమీడియా షేరింగ్ - అరత్తైకి కూడా అవసరం. "ఇప్పటికి, అరత్తై ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ , ఫీచర్ సెట్ వాట్సాప్‌కు సమానం కావాలి" అని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.