Bharat NCAP 5 Star Cars 2025: భారతీయ SUV మార్కెట్‌లో, సేఫ్టీకి కొత్త బెంచ్‌మార్క్‌ సెట్‌ చేస్తూ సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ SUV భారత్ NCAP క్రాష్‌ టెస్ట్‌లలో అద్భుత ఫలితాలు సాధించింది. ఈ SUVకి... అడల్ట్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెషన్‌ (Adult Occupant Protection - AOP) విభాగంలో 5 స్టార్స్‌ రావడం ప్రత్యేకత. మొత్తం 32 పాయింట్లకుగాను 27.05 స్కోరు సాధించింది. అలాగే, ఛైల్డ్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెషన్‌ (Child Occupant Protection - COP) కేటగిరీలో 49 పాయింట్లకు 40 స్కోరుతో 4 స్టార్‌ రేటింగ్‌ పొందింది.

సేఫ్టీ ఫీచర్లు

సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ SUV లో 40 కి పైగా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, హిల్‌ హోల్డ్‌ అసిస్టు, ISOFIX చైల్డ్‌ సీట్‌ యాంకర్లు, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, అన్ని సీట్లకీ 3 పాయింట్‌ సీటు బెల్ట్స్‌ స్టాండర్డ్‌గా ఉన్నాయి. ఈ ఫీచర్లు, సిట్రోయెన్‌ బ్రాండ్‌ భద్రతపై ఈ కంపెనీ పెట్టిన ఫోకస్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి.

డిజైన్‌ & కంఫర్ట్‌

ఈ SUV ని... హై-స్ట్రెంగ్త్‌ స్టీల్‌, అడ్వాన్స్‌డ్‌ హై స్ట్రెంగ్త్‌ స్టీల్‌ (AHSS), అల్ట్రా హై స్ట్రెంగ్త్‌ స్టీల్‌ (UHSS) మిశ్రమంతో నిర్మించారు. కారు ముందు వైపు, పక్కన కేబిన్‌ ఇన్‌ట్రూషన్‌ తగ్గించేలా డిజైన్‌ చేశారు. LED ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌, ఆటోమేటిక్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ విత్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, పవర్‌-ఫోల్డింగ్‌ ORVMs‌, రియర్‌ AC వెంట్స్‌ ఈ కార్‌కు ప్రీమియం టచ్‌ ఇస్తాయి.

ఇంజిన్‌ ఆప్షన్స్‌

భారత మార్కెట్లో ఈ SUV రెండు పెట్రోల్‌ ఇంజిన్‌ ఆప్షన్స్‌తో లభిస్తోంది.

1.2 లీటర్‌ నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ ప్యూర్‌టెక్‌ 82 మిల్‌ - ఇది 81 bhp పవర్‌, 115 Nm టార్క్‌, 17.50 kmpl మైలేజ్‌ ఇస్తుంది & 5-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

1.2 లీటర్‌ టర్బోచార్జ్‌డ్‌ ప్యూర్‌టెక్‌ 110 - ఇది 108.6 bhp పవర్‌, 190 Nm టార్క్‌. 6-స్పీడ్‌ మాన్యువల్‌ & 6-స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌లలో అందుబాటులో ఉంది. మైలేజ్‌ మాన్యువల్‌లో 18.50 kmpl, ఆటోలో 17.60 kmpl ఇస్తుంది.

ధరలు

తెలుగు రాష్ట్రాల్లో, సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ SUV ధర అందుబాటులోనే ఉంది రూ. 8.32 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ నుంచి ప్రారంభమవుతుంది. టాప్‌-ఎండ్‌ టర్బో AT Max Dual Tone 5+2 వేరియంట్‌ ధర రూ. 14.10 లక్షల ఎక్స్‌-షోరూమ్‌. ఈ ప్రైస్‌ రేంజ్‌లో SUV సెగ్మెంట్‌లో పోటీ బలంగా ఉంటుంది.

మార్కెట్‌ అంచనాలు

Bharat NCAP 5 స్టార్‌ రేటింగ్‌తో Citroen Aircross SUV భద్రత పరంగా కస్టమర్ల విశ్వాసం గెలుచుకుంది. సిట్రోయెన్‌ ఈ విజయాన్ని Citroen 2.0 స్ట్రాటజీకి మైలురాయిగా చెబుతోంది. ఇప్పుడు, మన SUV మార్కెట్లో ఈ వాహనం సేఫ్టీ, కంఫర్ట్‌, స్టైల్‌ కలయికగా నిలుస్తోంది. SUV కొనుగోలు చేసే సమయంలో, ఇప్పుడు, ఎక్కువ మంది కస్టమర్లు క్రాష్‌ టెస్ట్‌ రేటింగ్స్‌ను దృష్టిలో పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో. ఎయిర్‌క్రాస్ SUV 5 స్టార్ రేటింగ్ సాధించడం బ్రాండ్‌ ఇమేజ్‌ను మరింత పెంచుతుంది. పోటీ కార్లు - Hyundai Creta, Kia Seltos, Maruti Grand Vitara వంటి కార్లతో పోలిస్తే, సిట్రోయెన్ భద్రతా పరంగా ముందంజలో నిలిచినట్టే చెప్పాలి.