ప్రపంచవ్యాప్తంగా మద్యం ప్రియులు ఎక్కువగా బీర్‌ను అంటే చాలా ఇష్టపడతారు. మగవారే కాదు, ఇటీవలి కాలంలో అతివలు కూడా బీర్ తాగడానికి చాలా ఇష్టపడుతున్నారు. అలాంటి బీర్‌కు 6 వేల సంవత్సరాల చరిత్ర ఉందంటే నమ్ముతారా? పూర్వపు మెసపటోమియా, ఈజిప్ట్ నాగరికతల్లో కూడా ఇది పానీయంగా ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. అయితే, ప్రస్తుతం అధికంగా మద్యం సేవించే మద్యపాన ప్రియులు తాగే ఈ బీర్ తయారీలో ఏ పదార్థాలు వాడతారో తెలుసా? మీకు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి.

బీర్‌లో ఈ నాలుగు ప్రక్రియలే కీలకం

బీర్ తయారీలో మాల్ట్ (Malt), హోప్స్ (Hops), ఈస్ట్ (Yeast), కార్బోనేషన్ కీలకం. బీర్‌లో మాల్ట్ ప్రధానం. ఇది బీర్‌కు శరీరం లాంటిది. దీని వల్ల తీపి స్వభావం, ఆల్కహాల్‌ను ఇస్తుంది. మాల్టెడ్ బార్లీ నుండి వచ్చే పిండి పదార్థమే ఆల్కహాల్‌గా మారుతుంది. ఇక ఈ బీర్‌లో మరో ప్రధాన కారకం హాప్స్ (Hops). ఇవి బీర్‌కు చేదు (Bitterness), సువాసన (Aroma)ను అందిస్తాయి. అంతేకాకుండా, నిల్వ సామర్థ్యాన్ని (Preservative) ఇస్తాయి. ఈ చేదు, మాల్ట్ యొక్క తీపిని సమతుల్యం చేస్తుంది. ఇక కార్బన్ డయాక్సైడ్ ద్వారా కార్బొనేషన్ చేయడం వల్ల నురుగు వస్తుంది. ఇలా ఈ నాలుగు ముఖ్యమైన ముడి పదార్థాల సమతుల్యత కారణంగా బీర్ ప్రత్యేకమైన రుచిని సంతరించుకుంటుంది. బీర్‌లో 90 శాతం వరకు నీరు ఉంటుంది. అయితే, ఈ నీటితో పాటు వాడే మినరల్స్ బీర్ రకాన్ని, రుచిని, నాణ్యతను నిర్ణయిస్తాయి.

మాల్టెడ్ బార్లీతో నురగలు కక్కే బీర్ తయారీ

బీర్‌ను తయారు చేసే విధానాన్ని 'బ్రూయింగ్' (Brewing) అంటారు. ఇందులో మాల్టెడ్ బార్లీ ముఖ్యమైన ముడిపదార్థం. మాల్టెడ్ అంటే బార్లీ గింజలను మొలకెత్తిస్తారు. ఆ మొలకలు మరింత పెరగకుండా వేడి నీటిలో నానబెడతారు. బార్లీ మొలకెత్తే సమయంలో సహజంగానే ఎంజైమ్‌ల ఉత్పత్తి (Enzyme Production) జరుగుతుంది. ఈ ఎంజైమ్‌లే మద్యం తయారీలో కీలకపాత్ర పోషిస్తాయి. ఈ మాల్టింగ్ ప్రక్రియ వల్ల ఉండే పిండి పదార్థం (Starch) తేలికగా విచ్ఛిన్నమయ్యే రూపంలోకి మారుతుంది. బార్లీతో పాటు, నీరు, హాప్స్ పువ్వులు (Hops), మరియు ఈస్ట్ (Yeast); ఇతర ధాన్యాలు (గోధుమ, బియ్యం, మొక్కజొన్న) కూడా వాడతారు. ఆ తర్వాత మాల్టెడ్ బార్లీ లేదా ఇతర ధాన్యాన్ని వేడి నీటిలో కలిపి పిండి పదార్థాలను చక్కెరగా మారుస్తారు. ఈ ద్రవాన్ని 'వార్ట్' (Wort) అంటారు.

ఈ వార్ట్‌ను వేడి చేసి హోప్స్ పువ్వులను చేరుస్తారు. ఈ హోప్స్ చేదును, సరికొత్త రుచిని కలిగిస్తాయి. అంతేకాకుండా, ఇది సహజంగా మద్యాన్ని నిల్వ చేసేందుకు (Preservative) పనిచేస్తుంది. ఆ తర్వాత ఈ ద్రవాన్ని ఫెర్మెంటేషన్ (Fermentation) చేస్తారు. ఈ వార్ట్‌ను చల్లబరిచి, అందులో ఈస్ట్‌ను కలుపుతారు. ఈస్ట్ చక్కెరలను ఆల్కహాల్‌గా మరియు కార్బన్ డయాక్సైడ్‌గా మారుస్తుంది. ఆ తర్వాత తయారైన బీర్‌ను ఫిల్టర్ చేసి బాటిల్స్‌లో నింపుతారు. కొన్నిసార్లు అదనంగా కార్బొనేషన్ చేస్తారు. బీర్‌లో కార్బన్ డయాక్సైడ్ () వాయువును కరిగిస్తారు. ఈ ప్రక్రియే బీర్‌కు దాని ప్రత్యేకమైన బుడగలు (Fizziness), నురుగు (Head), మరియు కొద్దిగా ఘాటైన అనుభూతి (Tingling sensation) అందిస్తుంది. ఇందులో ఆల్కహాల్ శాతం (ABV - Alcohol by Volume): సాధారణంగా 4% నుండి 8% వరకు ఉంటుంది. కొన్ని క్రాఫ్ట్ బీర్లు (Craft Beers) 12% లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది.

ఇతర మద్యాలతో బీర్ ప్రత్యేకమే: నురుగు (Carbonation and Head)

ఇతర మద్యాలతో పోలిస్తే బీర్‌ను ప్రత్యేకంగా నిలబెట్టేది నురుగే. సహజ కార్బొనేషన్ ద్వారా ఈ ప్రత్యేకతను బీర్ సంతరించుకుంటుంది. బీర్‌లో బుడగలు (Fizziness): బీర్‌లో ఉండే కార్బన్ డయాక్సైడ్ () బుడగలు గొంతుకు చల్లని, ఘాటైన అనుభూతిని ఇస్తాయి. ఇక బీర్ పై భాగంలో ఉండే నురుగు బీర్ సువాసనలను పోకుండా చూస్తుంది. నురుగే బీర్ నాణ్యతకు నిదర్శనం. ఇక వందలాది రకాల బీర్లు ఉన్నాయి.