YSRCP Latest News: ఏపీ ఎన్నికల కోసం నియోజకవర్గ ఇంఛార్జిలను మారుస్తున్న వైఎస్ఆర్ సీపీ.. తాజాగా మూడో జాబితా విడుదల చేసింది. ఈసారి 23 మందికి ఈ జాబితాలో చోటు లభించింది. మొదటి జాబితా 11 మందితో విడుదల చేయగా.. రెండో జాబితాలో 27 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా 21చోట్ల అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారు. ఈ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసు సమీపంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి మూడో జాబితాలోని పేర్లను ప్రకటించారు.
ఎంపీ అభ్యర్థులువిశాఖపట్నం ఎంపీ - బొత్స ఝాన్సివిజయవాడ - కేశినేని నానిశ్రీకాకుళం - పేరాడ తిలక్కర్నూల్ ఎంపీ - గుమ్మనూరి జయరాంతిరుపతి ఎంపీ - కోనేటి ఆదిమూలంఏలూరు - కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
ఎమ్మెల్యే అభ్యర్థులుఇచ్ఛాపురం - పిరియ విజయటెక్కలి - దువ్వాడ శ్రీనివాస్చింతలపూడి (ఎస్సీ) - కంభం విజయరాజురాయదుర్గం - మెట్టు గోవింద్ రెడ్డిదర్శి - బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపూతలపట్టు (ఎస్సీ) - మూతిరేవుల సునీల్ కుమార్చిత్తూరు - విజయానంద రెడ్డిమదనపల్లె - నిస్సార్ అహ్మద్రాజంపేట - ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డిఆలూరు - బూసినే విరూపాక్షికోడుమూరు (ఎస్సీ) - డాక్టర్ సతీష్గూడూరు (ఎస్సీ) - మేరిగ మురళిసత్యవేడు (ఎస్సీ) - మద్దిల గురుమూర్తిపెనమలూరు - జోగి రమేశ్పెడన - ఉప్పాల రాము
శ్రీకాకుళం జడ్పీ ఛైర్మన్ గా ఉప్పాడ నారాయణమ్మను నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఇచ్ఛాపురం జడ్పీటీసీగా ఈమె పని చేస్తున్నారు.