Pothula Sunitha Brother Murder: వైసీపీ (YSRCP News) ఎమ్మెల్సీ పోతుల సునీత (Pothula Sunitha) సోదరుడు రాము కర్నూలు (Kurnool News) జిల్లాలో దారుణ హత్యకు గురయ్యాడు. 57 ఏళ్ల రామును కర్నూలు జిల్లా పెండేకల్లు రైల్వే జంక్షన్ లో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. 30 ఏళ్ల క్రితం రాములు పీపుల్స్ వార్ పార్టీలో పని చేశారు. 1991లో పోలీసులకు లొంగిపోయాడు. స్వగ్రామంలో ఉంటూ పనులు చేసుకుంటున్న ఆయన...10 ఏళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. నిన్న రైల్వే స్టేషన్ లో నిద్రించిన సమయంలో.. దుండగులు బండరాయితో కొట్టి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
YSRCP News: వైసీపీ ఎమ్మెల్సీ సోదరుడు దారుణ హత్య - కర్నూలులో కలకలం
ABP Desam | 07 Jan 2024 12:28 PM (IST)
Pothula Sunitha: సోదరుడు రాము కర్నూలు జిల్లాలో దారుణ హత్యకు గురయ్యాడు. 57 ఏళ్ల రామును కర్నూలు జిల్లా పెండేకల్లు రైల్వే జంక్షన్ లో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.
Ycp Mlc Pothula Sunitha Brother Murdered In Kurnool