" ‘‘కృష్ణానదిపై రెండు సంవత్సరాల నుంచి ప్రాజెక్టులు కడుతుంటే.. కేసీఆర్‌కు ఇప్పుడే తెలివొచ్చిందా?. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటికి ఆహ్వానించి భోజనాలు పెట్టొచ్చు. ఇద్దరూ కలిసి ఉమ్మడి శత్రువును ఓడించొచ్చు. కానీ, రెండు నిమిషాలు కూర్చుని సమస్యను పరిష్కరించుకోలేరా?. మరోసారి కూర్చుని నీటి సమస్యపై ఎందుకు చర్చించరు. సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం చూస్తూ కూర్చుంది.  సమస్యను పరిష్కరించుకోవాలనే చిత్తశుద్ధి ఎవరిలోనూ లేదు. న్యాయబద్దంగా తెలంగాణకు దక్కాల్సిన నీటిబొట్టునూ వదులుకోం. ఇతర ప్రాంతానికి చెందిన నీటి చుక్కను కూడా మేం తీసుకోం. రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలన్నదే మా సిద్ధాంతం. ఎంతోమంది నేతలకు వైఎస్‌ఆర్‌ రాజకీయ భిక్షపెట్టారు. వైఎస్‌ఆర్‌ను తిడుతుంటే ఈ కాంగ్రెస్‌ నేతలు చప్పుడు చేయటం లేదు. కాంగ్రెస్‌ పార్టీకి వైఎస్‌ఆర్‌ పేరు ఉచ్ఛరించే అర్హత లేదు. వైఎస్‌ఆర్‌ అసలైన వారుసులం మేమే. నేటి నుంచి 100 రోజుల తర్వాత పాదయాత్ర చేస్తా’’ "
- - వైయస్​ షర్మిల