Breaking News Telugu Live Updates: జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్తత, బాలికకు న్యాయం చేయాలని బీజేపీ నేతలు ఆందోళన

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 03 Jun 2022 07:47 PM
జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో ఎమ్మెల్యే, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారులు అరెస్టు 

జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో అరెస్టుల పర్వం మొదలైంది. ఎమ్మెల్యే కుమారుడితో పాటు వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ శివారులో వారిని అరెస్టు చేసినట్లు సమాచారం. 

జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్తత, బాలికకు న్యాయం చేయాలని బీజేపీ నేతలు ఆందోళన

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అత్యాచారానికి గురైన బాలికకు న్యాయం చెయ్యాలని బీజేపీ ఆందోళన చేపట్టింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ బీజేపీ నేతలు ముట్టడించారు.  నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 

Case Filed Against R Krishnaiah: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్ కృష్ణయ్యపై నాన్ బెయిలబుల్ కేసు

Case Filed Against R Krishnaiah: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్ కృష్ణయ్యపై కేసు నమోదు
రౌడీలు గూండాలతో భూ కబ్జాతో పాటు హత్యాయత్నం చేస్తూ తనను బెదిరిస్తున్నారంటూ రవీందర్ రెడ్డి ఫిర్యాదు
రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో నాన్ బెయిలబుల్ కేసు
447, 427, 506, 384 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

అచ్యుతాపురం బ్రాండిక్స్ ఎస్‌ఈజెడ్‌లో ప్రమాదం - అమ్మోనియం లీక్‌తో ఉద్యోగలకు అస్వస్థత

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బ్రాండిక్స్ ఎస్‌ఈజెడ్‌లో ప్రమాదం 
సీడ్స్ యూనిట్‌లో అమ్మోనియం లీక్‌.
వాయువు లీక్‌తో ఉద్యోగులకు అస్వస్థత
వాంతులు, తల తిరుగుడుతో ఇబ్బండి పడ్డ ఉద్యోగులు 
నలుగురు మహిళలకు ఎస్ఈజెడ్‌ లో చికిత్స 

Jubilee Hills Pub: బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోక్సో సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు

Jubilee Hills Pub: జుబ్లీహిల్స్ పబ్ మైనర్ గర్ల్ కేసులో ఎఫ్ఆర్ లోని వివరాలు ఇవే.


జుబ్లీహిల్స్ మైనర్ బాలిక లైంగిక దాడి కేసులో కొనసాగుతున్న దర్యాప్తు . బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోక్సో సెక్షన్ కిందా ఎఫ్ఐఆర్ రిజస్టర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలిక తండ్రి , మైనర్ గర్ల్ వివరాలు సీల్డ్ కవర్లో ఉంచిన పోలీసులు. గత నెల 28 న జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ కు పార్టీకి వెళ్లిందని ఫిర్యాదులో పేర్కొన్న తండ్రి. మైనర్ అమ్మాయిని రెడ్ కలర్ మెర్సిడెజ్ బెంచ్, ఇన్నోవా కారులో తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. TS09FL6460 నెంబర్ తో మెర్సిడెజ్ బెంచ్ కారు, మరో కార్ కు టీఆర్ నెంబర్ ఉంది.


కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించి మెడపై గాయం చేశారని.. ఘటన జరిగినప్పటి నుంచి తమ కూతురు షాక్ లో ఉందని తండ్రి తెలిపారు.

AP Movie Tickets: ఆన్ లైన్ సినిమా టికెట్ల అమ్మకాలపై ప్రభుత్వం గైడ్ లైన్స్ జారీ

ఏపీ: ఆన్ లైన్ సినిమా టికెట్ల అమ్మకాలపై ప్రభుత్వం గైడ్ లైన్స్ జారీ


నోడల్ ఏజెన్సీగా APFDC సర్వీస్ ప్రొవైడర్ నిర్వహణ బాధ్యతలు


రాష్ట్రంలోని అన్ని థియేటర్లు APFDCతో ఒప్పందం చేసుకోవాలి


నోడల్ ఏజెన్సీ ప్రొవైడర్ గేట్ వే ద్వారానే టికెట్లు విక్రయించాలి


ప్రతి టికెట్‌పై 2 శాతం సర్వీస్‌ ఛార్జి


థియేటర్లు పక్కాగా ఆన్‌ లైన్‌లో టికెట్లు అమ్మకాలు చేయాలి


కొత్త సినిమాకు వారం ముందు నుంచి మాత్రమే టికెట్లు అమ్మాలి

ఘోర రోడ్డు ప్రమాదం

కర్ణాటక కలబురగిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఓ లారీని ఢీకొట్టి బస్సు బోల్తాపడగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 8 మంది మరణించినట్లు సమాచారం. బస్సులో డ్రైవర్​తో పాటు మరో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. 12 మందిని రక్షించి ఆస్పత్రికి తరలించారు.


బీదర్​-శ్రీరంగపట్టణం హైవేపై కమలాపుర వద్ద శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు గోవా నుంచి హైదరాబాద్​ వస్తోంది. మృతులంతా హైదరాబాద్​కు చెందినవారే. బస్సును ఆరెంజ్​ కంపెనీకి చెందినదిగా గుర్తించారు.

YS Jagan Delhi Tour: హోం మంత్రి అమిత్ షాతో ముగిసిన ఏపీ సీఎం జగన్ భేటీ

హోం మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో పరిస్థితులు సహా పలు అంశాలపై అమిత్ షాతో సీఎం జగన్ చర్చించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది.

Priyanka Gandhi Corona Positive:  కాంగ్రెస్‌లో కరోనా కలకలం.. నిన్న సోనియాకు, నేడు ప్రియాంక గాంధీకి కరోనా

Priyanka Gandhi Corona Positive:  కాంగ్రెస్‌లో కరోనా కలకలం రేపింది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సహా పలువురికి కరోనా పాజిటివ్ అని గురువారం తెలిసింది. అయితే తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కూడా కొవిడ్ పాజిటివ్ అని తేలింది.

Sonia Gandhi Corona Positive: సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని భాగ్యలక్ష్మి ఆలయంలో కాంగ్రెస్ నేతల పూజలు

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరోనా బారి నుంచి త్వరగా కోలుకుని ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రతేక పూజలు చేశారు. సోనియమ్మ త్వరగా కోలుకోవాలని ఆలయంలో  ప్రత్యేక పూజలు, అర్చనలు చేసాము. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పూజలు చేస్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన,  నిజం చేసిన సోనియా ఆరోగ్యం బాగుండాలని మతాలకు అతీతంగా పూజలు చేస్తున్నామని భట్టి తెలిపారు.


బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వాఖ్యలు హాస్యాస్పదం. బండి సంజయ్ పుట్టక ముందు నుండే కాంగ్రెస్ నేతలు అమ్మవారికి పూజలు చేశారు. భాగ్యలక్ష్మి దేవాలయం బండి సంజయ్ కి ఏమైనా రాసిచ్చారా? ఆయన జాగీరు కాదు. మతాల మధ్య చిచ్చు పెట్టే, విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి. లేకుంటే తెలంగాణ ప్రజలు బండి సంజయ్ కి బుద్ధి చెబుతారని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

Harish Rao Tirumala Visit: శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి హరీష్ రావు

తిరుపతి : తిరుమల శ్రీవారిని తెలంగాణ ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. ఇవాళ (శుక్రవారం) వేకువజామున స్వామి వారి అభిషేక సేవలో హరీష్ రావు తన కుమారుడు తో కలిసి పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు. అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

Background

ఈ ఏడాది నాలుగైదు రోజుల ముందే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ప్రస్తుతం నైరుతు రుతువనాలు చురుకుగా కదులుతున్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతం వరకు సముద్రమట్టంపై 0.9 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని చోట్ల, మిజోరం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల వైపు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఉత్తర, సెంట్రల్ బెంగల్, ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయాలు, పశ్చిమ బెంగాల్, సిక్కింలను మరో రెండు రోజుల్లో తాకనున్నాయి. వ్యవసాయరంగానికి కీలకమైన నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని ఐఎండీ ఇటీవల ప్రకటించింది.  దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. మరోవైపు కొన్నిచోట్ల 2 నుంచి 4 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని సూచించారు. 


ప్రముఖ రచయిత, గోదారోళ్ల కితకితల పేరుతో ఫేస్‌బుక్ గ్రూప్ సృష్టించి చాలా మందికి స్ఫూర్తిగా మారిన ఈదర వీర వెంకట సత్యనారాయణ గుండెపోటుతో మృతి చెందారు. గురవారం రాత్రి 11.30 గంటలకు గుండెపోటు వచ్చింది. హుటాహుటిన 108 కాల్ చేసి ఆసుపత్రికి తరలించేందు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అంబులెన్స్ వచ్చేసరికే ఆయన తుది శ్వాస విడిచినట్టు  బంధువులు చెప్పారు.


పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. నిన్న స్వల్పంగా తగ్గిన  బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనించి భారీగా పుంజుకుంది. రూ.110 మేర పెరగడంతో  తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,930కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,600 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు వెండి ధర నిన్నటి ధర వద్ద నిలకడగా ఉంది. హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.67,600 అయింది.


ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరగడంతో  విజయవాడలో 24 క్యారెట్ల బంగారం  10 గ్రాముల ధర రూ.51,930 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,600 కు ఎగబాకింది. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.67,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం, తిరుపతిలో రూ.100 మేర పెరగడంతో నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,930 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,600 అయింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో నేడు 1 కేజీ వెండి ధర రూ.67,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 


హైదరాబాద్‌లో ఇంధన ధరలు వరుసగా మూడోరోజు నిలకడగా ఉన్నాయి. నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 వద్ద స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద స్థిరంగా ఉన్నాయి. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర 19 పైసలు తగ్గింది. పెట్రోల్ లీటర్ ధర రూ.109.16 కాగా, 17 పైసలు తగ్గడంతో డీజిల్‌‌ లీటర్ ధర రూ.97.35 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో 18 పైసలు తగ్గడంతో పెట్రోల్‌ లీటర్ ధర రూ.109.21 కాగా, 16 పైసలు తగ్గడంతో డీజిల్‌‌‌ లీటర్ ధర రూ.97.40 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.