Zelenskyy Rejects Putins Moscow Meeting Invitation: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్​స్కీ తిరస్కరించారు. రష్యా రాజధాని మాస్కోలో తనతో సమావేశం కావాలని పుతిన్​ విన్నవించగా.. ఆయన ఆహ్వానం రియలిస్టిక్​గా లేదని, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పుతిన్​ తనను మాస్కోలో కలవాల్సిందిగా కోరడం సరికాదన్నారు. రష్యాను ఉగ్రవాది దేశం అని పేర్కొన్నారు.  సమావేశానికి అలాంటి అవాస్తవిక స్థలాన్ని ఎంచుకోవడం ద్వారా రష్యాకు చర్చలపై నిజమైన ఆసక్తి లేదని ఆయన వ్యాఖ్యానించారు.

Continues below advertisement

‘ఉక్రెయిన్ ప్రస్తుతం క్షిపణి దాడులకు గురవుతోంది. ప్రతిరోజూ కాల్పులు జరుగుతున్నాయి. ఈ సమయంలో నేను ఈ ఉగ్రవాది రాజధానికి వెళ్లలేను’ అని జెలెన్​స్కీ ఓ అమెరికా మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు. కావాలంటే పుతిన్​ కీవ్​(ఉక్రెయిన్​ రాజధాని)కు రావచ్చు అని యూరోన్యూస్​తో జెలెన్స్కీ వ్యాఖ్యానించారు.

డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి..రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య ప్రత్యక్ష చర్చల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తీసుకువస్తున్నారు. గత నెల అలాస్కాలో పుతిన్‌తో జరిగిన శిఖరాగ్ర సమావేశం ముఖ్య ఉద్దేశాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక లేదా త్రైపాక్షిక సమావేశాన్ని ఏర్పాటు చేయడం కూడా ఒకటి.

Continues below advertisement

రద్దయిన సమావేశంశిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ వాషింగ్టన్‌ను సందర్శించి యూరోపియన్ నాయకులతో చర్చలు జరుపుతారని, ఆ తర్వాత పుతిన్, జెలెన్స్కీ సమావేశం జరిగే అవకాశం ఉందని చెప్పారు. అయితే రష్యా కొన్ని అదనపు షరతులు విధించడంతో ఆ సమావేశం రద్దయ్యింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడులను మరింత వేగవంతం చేసింది.

మాట్లాడటానికే.. లొంగిపోవడానికి కాదుఈ పరిస్థితుల నేపథ్యంలోనే కొద్దిరోజుల క్రితం పుతిన్ మాట్లాడుతూ.. ‘జెలెన్​స్కీని కలవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మాస్కోలో మాత్రమే’. పేర్కొన్నారు. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఈ విషయంపై యూరో న్యూస్​తో మాట్లాడారు. జెలెన్​స్కీని మాస్కోకు ఆహ్వానించామని పేర్కొన్నారు. ‘మాట్లాడటానికే, లొంగిపోవడానికి కాదు’ అని వ్యాఖ్యానించారు.

చర్చలను ప్రతిపాదించడమే విజయంగా భావిస్తోందిపారిస్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశం అనంతరం జెలెన్​స్కీ మాట్లాడారు. పుతిన్ ఆహ్వానంపై వ్యంగ్యంగా స్పందించారు. ‘సమావేశం జరగకూడదని ఆశిస్తే, మీరు నన్ను మాస్కోకు ఆహ్వానించాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యక్ష చర్చల గురించి ప్రతిపాదించడమే రష్యా తన విజయంగా భావిస్తోంది అని జెలెన్​స్కీ పేర్కొన్నట్లు యూరోన్యూస్ తెలిపింది.

దేశంలోని 14 ప్రాంతాలపై ఈ దాడులుఇదిలా ఉండగా.. తన దేశంపై ఉక్రెయిన్​పై తీవ్ర దాడులు చేస్తోందని శనివారం జెలెన్​స్కీ వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ సెప్టెంబర్ మొదటి ఐదు రోజుల్లో రష్యా ఉక్రెయిన్‌పై 1,300 పైచిలుకు డ్రోన్లు, దాదాపు 900 గైడెడ్ బాంబులు, వివిధ రకాల 50 క్షిపణులను ప్రయోగించిందని పేర్కొన్నారు. దేశంలోని 14 ప్రాంతాలపై ఈ దాడులు జరిగినట్లు ఆయన తెలిపారు.