Woman Strips Naked On US Flight:  విమానాల్లో చాలా స్ట్రిక్ట్ ప్రోటోకాల్ పాటిస్తారు. భద్రత పరంగా సున్నితమైన విషయాల పట్ల ఇంకా కఠినంగా ఉంటారు. అందుకే ఫ్లైట్ ఎక్కేటప్పుడు గుండు సూది ఉన్నా ఒప్పుకోరు. కానీ కొంత మంది రచ్చ చేయాలనుకుంటే.. వారి దుస్తులతోనే చేయవచ్చు. ఈ విషయాన్ని అమెరికాలోని ఓ మహిళ నిరూపించింది. 

అమెరికాలోని హూస్టన్ నుండి ఫీనిక్స్ వెళ్లే విమానంలో ఒక మహిళ హఠాత్తుగా నగ్నంగా మారి గొడవ చేయడం ప్రారంభించింది. దీంతో ప్రయాణికులు హడలిపోయారు. ఏం చేస్తుందోనన్న  భయంతో వీడియోలు తీశారు.  విలియం పి హాబీ విమానాశ్రయం నుండి విమానం 733 టేకాఫ్ కోసం టాక్సీయింగ్ ప్రారంభించిన సమయంలో ఈ సంఘటన జరిగింది.

వైరల్ అయిన వీడియోలో ఉన్న మహిళ తన దుస్తులన్నీ తొలగించి  ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ తిరుగుతూ  దాదాపు 25 నిమిషాల పాటు హంగామా చేశారు. కాక్‌పిట్ తలుపును తట్టడం , విమానాన్ని వెనక్కి తిప్పాలని డమాండ్ చేయడం చేశారు.

 ఆమె విమానం గాల్లోకి ఎగరక ముందే రన్ వే మీద పరుగు అందుకుంటున్న సమయంలోనే తాను దిగిపోతానని గొడవ చేశారు.  పట్టించుకోకపోవడంతో  విమానం కదులుతూనే ఉండగా, ఆమె తన దుస్తులను విప్పడం ప్రారంభించింది. చాలా సేపటి వరకూ అలాగే చేయడంతో పైలట్.. ఎందుకైనా మంచిదని .. తిరిగి వెనక్కి వచ్చింది. ఆమెను అక్కడ దించేసి.. కాస్త ఆలస్యంగా మిగిలిన ప్రయాణికుల్ని వారి గమన్యస్థానాలకు చేర్చారు.  

పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమెకు మానసిక సమస్యలు ఉన్నాయని గుర్తించినట్లుగా తెలుస్తోంది.