No bullet trains in America: అమెరికాలో చాలా వింతలు, విశేషాలు చూసి ఉంటారు కానీ.. అక్కడ బుల్లెట్ ట్రైన్స్ ను మాత్రం ఎవరూ చూసి ఉండరు. ఎందుకంటే ఆ దేశంలో బుల్లెట్ ట్రైన్స్ లేవు.   200 mph లేదా 320 km/h కంటే ఎక్కువ వేగంతో నడిచే వాటిని బుల్లెట్ రైళ్లుగా చెప్పవచ్చు. ఇలాంటి రైళ్లు అమెరికాలో లేవు. ఎందుకు లేవనేదానిపై ఆసక్తికర కారణాలు ఉన్నాయి.  

బుల్లెట్ ట్రైన్స్ వేసినా దూరాలు తగ్గవు ! 

అమెరికా చాలా విశాలమైన దేశం, దీని జనాభా సాంద్రత యూరప్ ,  ఆసియా దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. ఉదాహరణకు, చైనాలో షాంఘై నుండి బీజింగ్ వరకు  ఐదారు గంటల్లో చేరుకుంటుంది. కానీ అమెరికాలో న్యూయార్క్ నుండి లాస్ ఏంజిల్స్ వెళ్లాలంటే బుల్లెట్ ట్రైన్ అయినా ఇరవై గంటలు పడుతుంది. రెండు నగరాల మధ్య దూరం  2,446 మైళ్లు. రైలు నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్నది. అందుకే విమానాలకే ప్రాధాన్యం ఇస్తారు. 

అమెరికా నగరాలు సబర్బన్ ప్రాంతాలు

అమెరికన్ నగరాలు సాధారణంగా సబర్బన్ నిర్మాణంలో ఉంటాయి, అంటే జనాభా విస్తరించి ఉంటుంది. ఇది రైలు స్టేషన్‌లకు చేరుకోవడానికి కార్లపై ఆధారపడేలా చేస్తుంది. యూరప్ లేదా జపాన్‌లలో  నగరాల్లో జనాభా అంతా ఒకే చోట ఉన్నట్లుగా ఉంటారు.  డల్లాస్  అమెరికా  క్క 4వ అతిపెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతం. ఈ ప్రాంత  జనాభా సాంద్రత చైనా లోని  హెబీ ప్రావిన్స్ కంటే తక్కువ.  సరుకు రవాణాకే రైళ్ల ప్రాధాన్యం                   

అమెరికాలో రైలు ట్రాక్‌లు ఎక్కువగా  సరుకు  రవాణాకు అనుకూలంగా ఉంటాయి.  ఈ ట్రాక్‌లు నెమ్మదిగా ఉంటాయి.  బుల్లెట్ ట్రైన్‌లకు అవసరమైన 200 mph వేగాన్ని తట్టుకోలేవు. ఫ్రైట్ రైళ్లు ఒక గాలన్ డీజిల్‌తో 470 మైళ్ల దూరం ఒక టన్ సరుకును రవాణా చేయగలవు.  ఇవి ప్యాసెంజర్ రైళ్లకు అనుకూలం కాదు. అమెరికాలోని చాలా రైలు ట్రాక్‌లు 100 సంవత్సరాల కంటే పాతవి. ఇవి షార్ప్ కర్వ్‌లు, పాత టన్నెల్‌లు, , బాటిల్‌నెక్‌లతో నిండి ఉన్నాయి. దూరాల కారణంగా రైల్వే నెట్ వర్క్ విస్తరణపై అమెరికా పాలకులు గతంలో ఆసక్తి చూపించలేదు. 

భారీ ఖర్చు .. నిర్మాణం ఆలస్యం                     బుల్లెట్ ట్రైన్‌లకు డెడికేటెడ్, స్ట్రెయిట్, గ్రేడ్-సెపరేటెడ్ ట్రాక్‌లు అవసరం. అమెరికాలో ఇటువంటి ట్రాక్‌లు నిర్మించడానికి భారీ ఖర్చు అవుతుంది. కొంంత కాలం కిందట  లాస్ ఏంజిల్స్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో వరకూ హై స్పీడ్ రైల్ నిర్మించాలని అనుకున్నారు. 2008లో  $33 బిలియన్లుగా అంచనా వేశారు. ఇప్పుడు అది   $113 బిలియన్‌కు పెరిగింది. ఇప్పటిక ీపూర్తి కాలేదు.   2033కు అవుతుందని చెబుతున్నారు. ఇంత సమయం తీసుకున్న తర్వాత వాటికి ఎంత ఆదరణ ఉంటుందో అంచనా వేయలేకపోతున్నారు. అదే సమయంలో దీర్ఘ దూర ప్రయాణాలకు విమానాలు చౌకగా   ఉంటాయి.