Pakistani agent Jyoti Malhotra: పాకిస్తాన్ కు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తూ.. ఐఎస్ఐ ఏజెంట్ గా మారినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి మల్హోత్రా గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జ్యోతి మల్హోత్రా ... తరచూ ఢిల్లీకి వెళ్లేవారు. దీనికి కారణం పాకిస్తాన్ హైకమిషన్ లో పని చేసే డానిష్ అనే ఉద్యోగినే. ఆయనను కలసేందుకు జ్యోతి మల్హోత్రా ఢిల్లీకి వెళ్లేవారు. డానిష్ సూచన మేరకు రెండు సార్లు సీక్రెట్ గా .. పాకిస్తాన్ పర్యటనకు కూడా వెళ్లి వచ్చారు.
డానిష్ ఆమెను ట్రాప్ చేశాడని తెలుస్తోంది. పాకిస్తాన్ హైకమిషన్ లో జరిగే విందులకు జ్యోతి మల్హోత్రా ప్రత్యేకంగా హాజరయ్యేవారు. గతంలో జరిగిన ఇఫ్తార్ విందుకు ఆమె వెళ్లారు. ఆ వీడియోను..స్వయంగా తన చానల్ లో అప్ లోడ్ చేసుకున్నారు. ఆ వీడియోలో డానిష్ తో కలుపుగోలుగా మాట్లాడుతూ కనిపించారు.
డానిష్ గా పిలుచుకునే పాకిస్తాన్ స్పై.. పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో పని చేస్తూ.. భారతీయుల్ని ట్రాప్ చేస్తూంటాడు. వివిధ పద్దతుల్లోట్రై చేసి.. సమాచారం తీసుకుని వారిని దేశద్రోహులుగా మార్చేస్తున్నాడు. ఇందులో హనీ ట్రాప్ అంశం కూడా ఉంది. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో పార్టీ జరిగింది. కేక్ తీసుకెళ్తూ ఓ ఉద్యోగి మీడియా కంటబడ్డాడు. అప్పటికి అతను ఉద్యోగి అనే అనుకున్నారు. అతను డానిష్ అని చాలా కొద్ది మందికే తెలుసు. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
పహల్గాం దాడిని సెలబ్రేట్ చేసుకున్న డానిష్.. తర్వాత దేశంలో రహస్య కార్యకాలపాలు నిర్వహిస్తున్నారని భారత్ బహిష్కరించింది. అతనితో సంబంధం ఉన్న జ్యోతి మల్హోత్రాను అధికారులు పట్టుకున్నారు. దాంతో ఇప్పుడు ఏమేం విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీడియోలు వైరల్ అవుతున్నాయి.